Begin typing your search above and press return to search.

అంతా అయిపోయాక...ఇదేం రచ్చ?

By:  Tupaki Desk   |   8 Feb 2019 6:10 AM GMT
అంతా అయిపోయాక...ఇదేం రచ్చ?
X
ఈ మధ్య మరీ ఫ్యాషన్ అయిపోయింది...సినిమా హిట్ అయితే తమ ఖాతాలో వేసుకోవడం, సినిమా పోతే ఎవరో ఒకరిపై నెట్టేసి చేతులు దులుపుకోవడం. అది హీరో అయినా, నిర్మాత అయినా, దర్శకుడు అయినా ఎవరైనా సరే. ఇక ఆ కధ కాస్త పక్కన పెడితే కాసేపు మన 'వినయ విధేయ రామ' విషయానికే వద్దాం. ఈ సినిమా భారీ డిసాస్టర్ ను చవి చూసింది. ఒక పెద్ద మాస్ దర్శకుడు బోయ పాటి, మరో పక్క మాస్ హీరో రామ్‌ చరణ్ ఇద్దరూ మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలు తారుమారు అయ్యి సినిమా పరాజయాన్ని చవి చూసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో బయ్యర్స్ బాగా నష్టపోవడంతో బరిలోకి దిగిన చెర్రీ 15 కోట్ల వరకూ బయ్యర్స్ కి తిరిగి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో అయిదు తన జేబులో నుంచి, అయిదు నిర్మాత, ఇంకో అయిదు దర్శకుడు ఇవ్వాలి అని ప్లాన్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ, అసలు చెర్రీ ఎందుకు సినిమా బిజినెస్ లో వేలు పెడుతున్నాడు అని చిరు సైతం ప్రశ్నించాడని టాక్. అయితే ఈ సినిమాని కొన్న యూవీ క్రియేషన్స్ వాళ్ళు చెర్రీ స్నేహితులు కావడంతో వారిని ఆదుకునే క్రమంలో చెర్రీ రంగంలోకి దిగాల్సి వచ్చిందట. సరే ఇక మరో పక్క బోయపాటి మాత్రం తాను అయిదు కోట్లు వదులుకోవడానికి సిద్దంగా లేనట్లు తెలియడంతో బోయపాటిని కన్విన్స్ చెయ్యడానికి మన అల్లు ఆరవింద్ ని రంగంలోకి దింపాల్సి వచ్చిందట.

దానికి గల కారణం ఏంటి అంటే, బోయపాటికి అల్లు ఆరవింద్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. సరైనోడు భారీ హిట్ తర్వాత అల్లు బోయపాటితో మరో సినిమా చెయ్యాలి అని కాంట్ర్యాక్ట్ మాట్లాడుకున్నాడట. ఆ రకంగా బోయపాటితో ఆరవింద్ సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని చెర్రీ ఇలా ప్లాన్ చేశాడు.. మరి చెర్రీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? బోయపాటి ఒప్పుకుంటాడా? ఏది ఏమైనా సినిమా ఫ్లాప్ అవడంతోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది కానీ, అదే హిట్ అయ్యి ఉంటే, ఆ విజయాన్ని ఎవరికి వారు తమ మెడలో వేసుకుని తిరిగేవారు అని చెప్పవచ్చు.