Begin typing your search above and press return to search.

కోట్లు కుమ్మరిస్తున్న అరవింద్

By:  Tupaki Desk   |   2 April 2016 7:08 AM GMT
కోట్లు కుమ్మరిస్తున్న అరవింద్
X
బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు చిత్రంపై.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సాధారణంగా ప్రమోషన్స్ విషయంలో ఎగ్రెసివ్ గా ఉండే అల్లు అర్జున్.. సరైనోడు కోసం డిఫరెంట్ గా ప్రచారం ప్రారంభించేశాడు. ఇప్పటికే ఆడియో వేడుక లేకుండానే పాటలను మార్కెట్ లోకి వదిలేసిన సరైనోడు యూనిట్.. ఇప్పుడు విశాఖపట్నంలో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ పేరుతో.. విశాఖలో భారీ ఎత్తున వేడుక చేయనున్నారు. దీన్ని ఓ పబ్లిక్ ఫంక్షన్ గానే చేయాలని అల్లు అర్జున్ తండ్రి - సరైనోడు నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారు. కేవలం ఈ ఈవెంట్ కోసమే కోటి రూపాయల బడ్జెట్ కేటాయించారని అంటున్నారంటే.. సరైనోడుపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతుంది. విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న ఈ వేడుకకు.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల నుంచి మెగా ఫ్యాన్స్ - బన్నీ అభిమానులు హాజరు కానున్నారు. అందుకే ఏర్పాట్ల విషయంలో లోటు లేకుండా ఉండేందుకు కోటి వెచ్చిస్తున్నారు.

ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ ను తీసేందుకు ఇలాగే భారీ మొత్తాన్ని వెచ్చించారు. సరైనోడులో ఒక్క ఇంటర్వెల్ సీన్ కోసమే దాదాపు రెండుకోట్లు వెచ్చించారనే టాక్ ఉంది. ప్రస్తుతం బన్నీ రేంజ్ పెరిగిపోవడం, సరైనోడుపై అంచనాలు ఎక్కువగా ఉండడంతోనే.. ఎంత ఖర్చుకైనా అల్లు అరవింద్ వెనకాడ్డం లేదని అంటున్నారు.