Begin typing your search above and press return to search.
బన్నీ చిన్న పిల్లాడి కోరికలు
By: Tupaki Desk | 26 April 2016 4:13 AM GMTసరైనోడు చిత్రం కోసం ఓ నిర్మాతగా అల్లు అరవింద్ చాలానే ఖర్చు పెట్టి, ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీసేశారు. ఓ పాటకు రెండున్నర కోట్ల సెట్ - ఓ ఫైట్ కి రెండు కోట్ల ఖర్చు.. ఇలా ఉన్నాయ్ సరైనోడి లెక్కలు. కొడుక్కోసం కాక.. ఇంకెవరికి ఖర్చు పెడతారు బాస్ అని బన్నీ అన్నాడు కానీ.. ఓ నిర్మాతగా తాను అన్నీ లెక్క పెట్టుకునే ఖర్చు చేశానంటున్నారు అల్లు అరవింద్. అలాగే ఈ సినిమా తీసే సమయంలో.. బన్నీ కోరిన కొన్ని కోరికల చిట్టాను.. సరైనోడు సక్సెస్ మీట్ లో విప్పారు అల్లు అరవింద్.
ఏదన్నా అడగాలంటే.. చిన్న పిల్లాడిలా అడిగేస్తూ ఉంటాడట బన్నీ. అలాగే ఓ యాడ్ ఫిలిం మేకింగ్ చూసి.. రిషి పంజాబీనే సినిమాటోగ్రాఫర్ గా పెట్టుకుందాం డాడీ అని పట్టుబట్టాడట. తీరా అతనేమో ఓ యాడ్ ఫిలింకి రోజుకు 12 లక్షలు ఛార్జ్ చేసేంతటి కాస్ట్లీ. మరి 120 రోజుల సినిమా కోసం ఎంత ఇవ్వాల్సొస్తుందో ఆలోచించండి అంటున్నారు అల్లు వారు. అలాగే.. ఇలాంటిదే మరో కోరిక కూడా కోరాడట బన్నీ.
'డాడీ.. ఈ పాటలో నా చుట్టూ ఓ 140 మంది డ్యాన్సర్స్ ఉండాలి. వాళ్లందరూ ముంబై నుంచి రావాలి'.. ఇదీ బన్నీ సింపుల్ గా వాళ్ల నాన్నకి చేసిన రిక్వెస్ట్. మరి దీన్ని నెరవేర్చేందుకు ఆయన తిప్పలు అన్నీ ఇన్నీ కావట. మొత్తానికి అన్నీ ఫుల్ ఫిల్ చేసే సినిమా చేశానన్నారు అల్లు అరవింద్. అంతే లెండి.. కొడుకు కోరిన కోరికలు కాక.. ఇంకెవరివి తీరుస్తారు ఏ తండ్రయినా.. అంతే కదా బన్నీ.!