Begin typing your search above and press return to search.
అల్లు అరవింద్ చేతికి 'ఎన్.టి.ఆర్'
By: Tupaki Desk | 16 March 2019 5:30 PM GMT‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు పాత్రలో కనిపించిన సుధాకర్ కోమాముల గుర్తున్నాడుగా. తొలి సినిమాలోనే ఏ బెరుకూ లేకుండా ఆత్మవిశ్వాసంతో నటించాడు సుధాకర్. ఐతే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో సరైన బ్రేక్ రాలేదు. మధ్యలో అతను ఒకటీ అరా సినిమాలు చేశాడు కానీ.. అవేవీ గుర్తింపు తీసుకురాలేదు. ఐతే అతను హీరోగా ‘నువ్వు తోపురా’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ ఒకటి తెరకెక్కింది. ఇంగ్లిష్‌లో రాస్తే ‘ntr’ అనే అక్షరాలు కలిసొచ్చేలా ఈ టైటిల్ ను డిజైన్ చేయడం విశేషం. ఇది జనాల దృష్టిని ఆకర్షించడానికి చేసిన గిమ్మిక్కు కావచ్చు. ఆ సంగతలా ఉంచితే కొన్ని నెలల కిందట విడుదలైన ‘నువ్వు తోపురా’ ట్రైలర్ చూస్తే సినిమాలో విషయం ఉన్నట్లే కనిపించింది. ఇండియా నుంచి అమెరికాకెళ్లి అక్కడ క్రిమినల్ పనులు చేసే హైదరాబాదీ కుర్రాడిగా కనిపిస్తున్నాడు సుధాకర్ ఇందులో. ఇది మంచి థ్రిల్లర్ లక్షణాలున్న సినిమా లాగా కనిపించింది ట్రైలర్ చూస్తే.
ఐతే ట్రైలర్ లాంచ్ తర్వాత వార్తల్లో లేకుండా పోయిన ‘నువ్వు తోపురా’ ఇప్పుడు ఆసక్తికర సమాచారంతో మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన ‘గీతా ఆర్ట్స్-2’ బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడట. ఈ చిత్ర నిర్మాత శ్రీకాంత్.. బన్నీ వాసుకు సినిమా చూపించి అతడితో ఆమోద ముద్ర వేయించుకున్నాడట. వేసవి కానుకగా ఏప్రిల్ 26న ‘నువ్వు తోపురా’ విడుదల కానున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’లో పెద్ద సినిమాలు చేస్తూనే.. ‘జీఏ-2’లో చిన్న సినిమాలకు సపోర్ట్ ఇస్తున్నారు. సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూనే.. అప్పుడప్పుడూ బయటి సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది ఇలాగే ‘పేపర్ బాయ్’ సినిమాను విడుదల చేశారు. అదేమంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఐతే ఇప్పుడు ‘నువ్వు తోపురా’పై నమ్మకం పెడుతున్నాడు. తోట తరణి లాంటి అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకు పని చేయడం విశేషం. నిరోషా అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహించాడు.