Begin typing your search above and press return to search.
'మెగా' ఇరకాటంలో 'అల్లు' ఫాదర్
By: Tupaki Desk | 26 Dec 2018 5:19 AM GMTకొన్నిసార్లు ఊహించని చిక్కుముడులు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.ఒకేసమస్య రెండు వైపులా తరుముతున్నప్పుడు బయటికి రావడం మహా కష్టంగా ఉంటుంది. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ పరిస్థితి ఇలాగే ఉందని ఇన్ సైడ్ టాక్. దాని ప్రకారం ఈ మధ్య గీత ఆర్ట్స్ మెయిన్ బ్యానర్ మీద సినిమాలు తీయడం తగ్గించేసిన అల్లు అరవింద్ కొత్త ప్రోజెక్టుల కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో సాయి ధరమ్ తేజ్ ది కూడా ఒకటి ఉందట. డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లతో బాగా డిఫెన్స్ లో పడిపోయిన తేజు కెరీర్ కి బూస్ట్ అప్ కావాలి అంటే అల్లు అరవింద్ చేయూత అవసరమని గుర్తించిన చిరంజీవి మేనల్లుడి కోసం అరవింద్ కు రికమండ్ చేసాడట.
అందుకే గీత గోవిందం అవ్వగానే ఇంకెవరికి కమిట్ కాకుండా బన్నీ వాస్ ద్వారా దర్శకుడు పరశురామ్ ని బ్లాక్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టే అతనూ కథను వండటంలో బిజీ అయిపోయాడు. చిత్రలహరి పూర్తయ్యేలోపే స్క్రిప్ట్ రెడీ చేసేలా వర్క్ జరుగుతోందట.
అయితే ఇక్కడో మెలిక వచ్చినట్టు సమాచారం. గత ఏడు నెలలుగా తనకు సరిపడే కథల కోసం విపరీతంగా మధనపడుతున్న అల్లు అర్జున్ కు పరశురామ్ రాసుకున్న వాటిలో ఓ కథ బాగా నచ్చిందట. అది తనకు డెవలప్ చేయమని ఒకవేళ త్రివిక్రమ్ ది స్టార్ట్ అయితే దాని తర్వాత ఏదైనా ఆలస్యం ఉంటే ముందే మొదలుపెట్టేలా డిస్కస్ చేసాడట.
అయితే అరవింద్ చిరుకి ఇచ్చిన మాట కోసం తేజుకె చేయమని చెప్పాల్సి ఉంటుంది. ఒకపక్క చెల్లి భర్త మరొపక్క కన్న కొడుకు. ఎవరినీ కాదనలేడు. అలాగని ఇదీ సమస్య అని ఇద్దరికీ చెప్పుకోనూ లేడు. ఇది ఆయనకు వచ్చిన ఇరకాటం అంటూ ఫిలిం నగర్ టాక్. ఇలాంటివి ఎన్నో చూసి పండిపోయిన అనుభవం కాబట్టి ఇదేమంత చిక్కు కాదు కానీ పైకి కనిపించేంత సులభంగా పరిష్కారం దొరుకుతుందా అనేదే సమస్య