Begin typing your search above and press return to search.

అల్లు అర‌వింద్ ఓ మాస్ట‌ర్ మైండ్‌..ఏదైనా సాధ్య‌మే!

By:  Tupaki Desk   |   13 Oct 2022 9:30 AM GMT
అల్లు అర‌వింద్ ఓ మాస్ట‌ర్ మైండ్‌..ఏదైనా సాధ్య‌మే!
X
అల్లు అర‌వింద్ ఓ మాస్ట‌ర్.. ఆయ‌న ఏం చేసినా..ఏ బిజినెస్ చేసినా.. ఏ రంగంలోకి అడుగు పెట్టినా సూప‌ర్ స‌క్సెస్‌.. ఇంత వ‌ర‌కు అప‌జ‌య‌మెరుగ‌ని ట్రాక్ రికార్డ్ అల్లు అర‌వింద్ సొంతం. నిర్మాత‌గా, స‌మ‌ర్ప‌కుడిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన సినిమాల్లో అత్య‌ధిక శాతం విజ‌యాలే అందుకున్నారే కానీ ఫ్లాపుల్ని సొంతం చేసుకున్న దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. అయితే అలాంటి ట్రాక్ రికార్డ్ వున్న అల్లు అర‌వింద్ కి ఓ కోరిక వుంద‌ట‌. ఆ కోరిక‌ని తాజాగా బ‌య‌ట పెట్టారు.

సినిమాల ప‌రంగా, డిస్ట్రిబ్యూష‌న్ ప‌రంగా సూప‌ర్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకున్న అల్లు అర‌వింద్ తెలుగులో తొలి ఓటీటీ ప్లాట్ ఫామ్ గా `ఆహా`ని ప్రారంభించి సినీ ప్రియుల చేత ఆహా అనిపించారు. డిజిట‌ల్ రంగంలో ఎన్నో పాపుల‌ర్ ఓటీగ‌టీలున్నా వాటికి ధీటుగా అన‌తా కాలంలోనే `ఆహా`ని నిల‌బెట్టి ఔరా అనిపించారు. ఓటీటీ రంగంలో దిగ్గ‌జ ఓటీటీల‌తో స‌మానంగా నిలిచేలా స‌క్సెస్ బాట ప‌ట్టించారు. అయితే అలాంటి మాస్ట‌ర్ మైండ్ ఇటీవ‌లే ఆలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఆలీతో స‌ర‌దాగా` షోలో పాల్గొన్నారు.

ఒక వేళ కాలం వెన‌క్కి తిరిగి మిమ్మ‌ల్ని ఏద‌న్నా కోరుకోమంటే మీకేం కావాలి అని అలీ ప్ర‌శ్నిస్తే.. ఒక‌ప్ప‌టి విజ‌యా వాహినీ స్టూడియోస్ త‌ర‌హాలో ఎన్విరాన్ మెంట్ కావాలంటూ త‌న మ‌న‌సులో వున్న కోరిక‌ని బ‌య‌ట‌పెట్టారు. అప్ప‌ట్లో పొద్దున్నే కార్ రాక‌పోతే `మాయాబ‌జార్‌`లాంటి సినిమాలో న‌టించిన సావిత్రి త‌న అసిస్టెంట్ సైకిల్ వెన‌కెక్కి స్టూడియోకు వ‌చ్చేవార‌ని, ఇప్ప‌డు అలాంటి కమిట్ మెంట్ ఏ న‌టీన‌టుల్లో వుంద‌న్నారు.

అల్లు అర‌వింద్ మ‌న‌సు ప‌డుతున్న ఆనాటి స్టూడియో సిస్ట‌మ్ ని తిరిగి మ‌ళ్లీ ప్ర‌వేశ పెట్ట‌డం సాధ్య‌మేనా? అంటే కొంత మంది ప్ర‌స్తుతం సాథ్యం కాద‌ని, అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్‌, ఎస్వీఆర్ లాంటి మ‌హా మ‌హులు కూడా స్టూడియోలతో కాంట్రాక్ట్ లు కుదుర్చుకుని నెల సాల‌రీల‌కు ప‌ని చేసేవారు. కానీ ఇప్ప‌డు అలాంటి ప‌రిస్థితులు లేవు. మారిన స‌మీక‌ర‌ణాలు, రోజు వారీ పారితోషికాలు.. ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు అలాంటి వాతావ‌ర‌ణం క్రియేట్ కావ‌డం క‌ష్ట‌మే. కానీ మాస్ట‌ర్ మైండ్‌.. అల్లు అర‌వింద్ త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే.

సిస్ట‌మ్ ఎలా వున్నా దాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌డంతో అల్లు అర‌వింద్ ని మించిన వారు లేర‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వుంది. త‌న‌దైన స్టైల్లో `ఆహా`ని అన‌తి కాలంలోనే టాప్ లో నిల‌బెట్టిన అల్లు అర‌వింద్ `అల్లు స్టూడియోస్‌`తో అనుకున్న మ్యాజిక్ ని సాధించ‌డం ఏమంత క‌ష్ట‌మైన ప‌నేమీ కాద‌న్న‌ది త‌న ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిన వాళ్లంతా యునానిమ‌స్ గా ఒప్పుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.