Begin typing your search above and press return to search.
అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదు!
By: Tupaki Desk | 1 Nov 2022 2:30 PM GMTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ అనే విషయం తెలిసిందే. ఆయన ఏది చేసినా, ఏ రంగంలోకి ప్రవేశించినా అందులో సక్సెస్ ని సొంతం చేసుకోవాలని వడి వడిగా అడుగులు వేస్తుంటారు. సక్సెస్ లని సొంతం చేసుకుంటుంటారు. అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తుంటారు. నిర్మాతగా, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా తనదైన సత్తా చాటిన అల్లు అరవింద్ 'ఆహా' పేరుతో మై హోమ్ రామేశ్వరరావు గ్రూప్ తో కలిసి తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
అనతి కాలంలోనే 'ఆహా' ఓటీటీని సక్సెస్ బాట పట్టించిన అల్లు అరవింద్ అన్ని ఓటీటీలకు భిన్నంగా అడుగులు వేస్తూ సరికొట్ట టాక్ షోలతో వీక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. మొదట్లో తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాపై ఆధరపడిన ఈ ఓటీటీని స్ట్రెయిట్ క్రేజీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు, పాపులర్ టాక్ షోలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ని ఎవరూ ఊహించని విధంగా హోస్ట్ గా రంగంలోకి దించేసి 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' అనే టాక్ షోని ప్రారంభించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపారు.
సీజన్ 1 ఇప్పటికే సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం బాలయ్యతో సీజన్ 2ని రీసెంట్ గా ప్రారంభించారు. దీనికి కూడా వీక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న నేపథ్యంలో మరో టాక్ షోకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం హాస్య బ్రహ్మ బ్రహ్మానందంని రంగంలోకి దించుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ టాక్ షోని మొదలు పెట్టిన ఆహా వర్గాలు త్వరలో బ్రహ్మానందం హోస్ట్ గా మరో టాక్ షోకు శ్రీకారం చుట్టబోతున్నారట.
ఇందు కోసం ఇటీవలే బ్రహ్మానందంతో చర్చలు జరిపిన ఆహా బృందం ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. పారితోషికం విషయంలోనే బ్రహ్మానందంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఆ లెక్క తేలితే 'ఆహా' నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడం పక్కా అని తెలిసింది. ఈ టాక్ షోని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్ దీని కోసం ముంబై టీమ్ ని దించేయాలనే ఆలోచనలో వున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.