Begin typing your search above and press return to search.

మీకు మీరే.. మాకు మాత్రం అల్లునే అన్నీ

By:  Tupaki Desk   |   14 Jun 2016 3:30 PM GMT
మీకు మీరే.. మాకు మాత్రం అల్లునే అన్నీ
X
మీరు మీరే మాకు మేమే.. ఈ సినిమాకి వీధుల్లో పోస్టర్స్ వేసి చాలా కాలమే అయింది. తరుణ్ శెట్టి - అవంతిక జంటగా నటించిన ఈ మూవీని నకమా ప్లానెట్ స్టూడియోస్ బ్యానర్ పై.. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ దర్శకుడి పేరు గతంలో జనాలకు పెద్దగా పరిచయం లేదు కానీ.. నాన్నకు ప్రేమతో మూవీకి స్టోరీ అందించడం ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. మంచి స్టోరీ ఇచ్చాడంటూ సుకుమార్ స్టేజ్ మీద పరిచయం చేయడంతో హుస్సేన్ కి పేరొచ్చింది.

అప్పటికే విడుదలకు సిద్ధమైన మీకు మీరే మాకు మామే.. రిలీజ్ కు చాలా కష్టాలనే ఎదుర్కుని.. చివరకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'మెచ్యూరిటీ లేని ఓ అబ్బాయి - బాగా మెచ్యూర్డ్ మైండ్ ఉన్న అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే మీకు మీరే మాకు మేమే. ఇదో రొమాంటిక్ ఎంటర్టెయినర్. మూవీస్ పై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్న టైంలో.. అల్లు అరవింద్ గారి సపోర్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించాం' అంటున్నాడు దర్శకుడు.

సినిమా తీయడం నుంచి తప్పులు సరిదిద్దే వరకూ.. ఫండింగ్ నుంచి రిలీజ్ వరకూ అంతా అల్లువారి అడుగుజాడల్లోనే ఈ సినిమా రూపొందించాం అంటున్నాడు హుస్సేన్ షా కిరణ్. యూట్యూబ్ లో విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కిందన్న దర్శకుడు.. పెద్ద స్టార్ హీరోతో పెద్ద బ్యానర్ పై సినిమా తీయబోతున్నానని.. త్వరలో డీటైల్స్ ప్రకటిస్తానని చెప్పాడు.