Begin typing your search above and press return to search.

అరవింద్ నమ్రతల మీటింగ్ జరిగిందా?

By:  Tupaki Desk   |   6 March 2019 5:56 AM GMT
అరవింద్ నమ్రతల మీటింగ్ జరిగిందా?
X
ఎన్నడూ లేనిది మహేష్ బాబు తాను ఒక దర్శకుడితో సినిమా చేయబోవడం లేదు అని నేరుగా ప్రకటించడం మాములు సంచలనం కాలేదు. జరిగి ఇరవై నాలుగు గంటలు దాటినా దాని గురించిన హాట్ డిస్కషన్స్ ఇంకా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఆ ట్వీట్ లో పరమార్థాన్ని ఇంకా వెలికి తీస్తూనే ఉన్నారు. అయితే మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం అల్లు అర్జున్ సుకుమార్ ల ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి ముందు రోజు అల్లు అరవింద్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ను వెళ్లి కలిశారట. మహేష్ రిజెక్ట్ చేసిన స్టోరీని అదే సుకుమార్ తో బన్నీ చేస్తాడని తన బాడీ లాంగ్వేజ్ కు సూటవుతుందని ఇలా పలు విషయాల గురించి చాలాసేపు చర్చించారట. దానికి సానుకూలంగా స్పందించిన నమ్రతా దానికి అభ్యంతరం ఏముంది వేరే కథతో సుకుమార్ సినిమాతో పాటు అనిల్ రావిపూడిది ఒకేసారి ప్లాన్ చేసుకున్నామని చెప్పి ముగించారట

కట్ చేస్తే అల్లు అర్జున్ సుక్కుల అనౌన్స్ మెంట్ రావడం ఆలస్యం కొన్ని గంటల్లోనే మహేష్ ఏకంగా సుకుమార్ తో ఏ సినిమా ఉండబోవడం లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. వేరే కథతో వచ్చే ఏడాది లేదా ఆపై సంవత్సరం అని కూడా చెప్పలేదు. మీ భవిషత్తు బాగుండాలి అని వదిలేశాడు. అంటే ఇప్పట్లో చేసే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పినట్టే.

మరి అల్లు అరవింద్ నమ్రతలు మాట్లాడుకున్నప్పుడు ఇలా జరిగే ఛాన్స్ ఉందని అనుకోలేదా అంటే ఏమో దానికి సమాధానం ఆ ఇద్దరికే తెలుసు. సుకుమార్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు. నమ్రతా అరవింద్ ల మీట్ సంగతేమో కానీ ఈ ఇష్యూ వల్ల బన్నీ తన ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా హై లైట్ అవుతున్నాడు