Begin typing your search above and press return to search.

ఇకపై అరవంలోనూ 'ఆహా'

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:36 AM GMT
ఇకపై అరవంలోనూ ఆహా
X
అల్లు అరవింద్‌ సారథ్యంలో సాగుతున్న ఆహా ఓటీటీ కి మంచి స్పందన దక్కింది. తక్కువ సమయంలోనే తెలుగు లో టాప్ ఓటీటీ ల సరసన ఆహా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆహా ఇప్పుడు తెలుగు వారికి మోస్ట్ వాంటెడ్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ గా మారింది. ఈ సమయంలో ఆహా ఓటీటీ ని మరింతగా విస్తరించేందుకు గాను అల్లు అరవింద్‌ అండ్ టీమ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆహా ను ఇతర భాషల్లోకి కూడా విస్తరించబోతున్నట్లుగా నిర్వహకులు తెలియజేశారు. అందులో భాగంగా ఆహా తమిళంను ఆరంభించేందుకు సిద్దం అయ్యారు. ఆహా లో మొదటి తమిళ ప్రాజెక్ట్‌ స్ట్రీమింగ్‌ కు ముహూర్తం ఖరారు అయ్యింది.

ఈనెల 28వ తారీకున ఆహా తమిళ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం శరత్‌ కుమార్‌ నటించిన ఇరై వెబ్‌ సిరీస్ ను ఎంపిక చేశారు. ఇరై లేదా ఆకాశ్‌ వాణి ని ఆహా తమిళంలో స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. తమిళం నుండి పెద్ద ఎత్తున కంటెంట్ ను ఆహా టీమ్‌ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆహా తెలుగు వర్షన్‌ కు ఎలా అయితే చిన్న సినిమాలతో మొదలు పెట్టారో అదే ఫార్ములాను తమిళ ఆహా కు కూడా ఫాలో అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తక్కువ బడ్జెట్‌ తో సొంతంగా కూడా వెబ్ సిరీస్ లను నిర్మించడం మాత్రమే కాకుండా తెలుగులో మాదిరిగా టాక్‌ షో లు మరియు ఇతర షో లను నిర్మించాలని ఆహా టీమ్‌ భావిస్తుందట.

తమిళ ప్రేక్షకులు ఆహా ను ఆధరించేలా కంటెంట్‌ ను వారికి ఇచ్చేందుకు ఇప్పటికే ఒక టీమ్‌ ను రెడీ చేశారు. తెలుగు కంటెంట్ కోసం వంశీ పైడిపల్లి ఆధ్వర్యంలో ఒక టీమ్ వర్క్ చేస్తుంది. షో లు మరియు వెబ్‌ సిరీస్ ల విషయంలో ఆ టీమ్ రెగ్యులర్ గా చర్చలు జరుపుతూ ప్రేక్షకులకు ది బెస్ట్‌ కంటెంట్‌ ను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే తమిళం లో కూడా అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కంటెంట్‌ ను ఇచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు ఆహా కు అల్లు అర్జున్ బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో ఆహాను ప్రమోట్‌ చేసేందుకు ఒక యంగ్‌ స్టార్‌ హీరో తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా ఇకపై అరవంలోనూ ప్రేక్షకులతో 'ఆహా' అనిపించడం ఖాయంగా అనిపిస్తుంది. అల్లు అరవింద్‌ ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ ఖచ్చితంగా విజయం సాధించే వరకు వదిలి పెట్టరు. అలాగే తెలుగు ఆహాను సక్సెస్ చేశారు. ఇప్పుడు తమిళ ఆహా ను కూడా తన ప్రతిభతో టాప్‌ లో ఉంచుతాడేమో చూడాలి. అయితే ఆహా కేవలం తెలుగు వారికి.. తెలుగు కంటెంట్ తో వస్తుందని తెలుగు ప్రేక్షకులకు హామీ ఇచ్చి ఇప్పుడు ఇలా ఇతర భాషల కంటెంట్ ను కూడా తీసుకు రావడం ను ప్రేక్షకులు ఏ మేరకు స్వాగతిస్తారు అనేది చూడాలి.

ఆహా తమిళ్‌ అని మరో ప్రత్యేకమైన యాప్‌ ఉంటుందా లేదంటే ఆహా యాప్‌ లోనే తెలుగు మరియు తమిళం కలిసి ఉంటాయా అనేది చూడాలి. ఒక్క తమిళంతో ఆగకుండా సౌత్‌ లో ఇతర భాషలు మరియు హిందీ లో కూడా ఆహా కంటెంట్ ఇచ్చేలా ముందు ముందు రోజుల్లో మారే అవకాశాలు ఉన్నాయి.