Begin typing your search above and press return to search.
గీత వన్ లో నో ఎంట్రీ ఎందుకు?
By: Tupaki Desk | 21 Nov 2018 11:42 AM GMTత ఆర్ట్స్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉంది అంటే దాని వెనుక అల్లు అరవింద్ అనే మాస్టర్ బ్రెయిన్ కారణం. చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ తీయడం వల్లే అది ఆ స్థాయికి వెళ్ళిందన్నది ఎంత నిజమో దాని వెనుక అరవింద్ అద్భుతమైన ప్లానింగ్ ఉందన్నది కూడా అంతే నిజం. కాకపోతే ఇప్పటిదాకా గీత ఆర్ట్స్ బ్యానర్ లో కేవలం మెగా హీరోల సినిమాలు మాత్రమే వచ్చాయి. బయటి వాళ్ళతో తీసిన ఇతర బ్యానర్ల సినిమాల్లో అల్లు అరవింద్ భాగస్వామ్యం తీసుకున్నప్పటికీ అది గీత ఆర్ట్స్ 2 మీదనో లేదా తన వ్యక్తిగత పేరు మీదనో చేసారు తప్ప ఎన్నడూ మెగా కాంపౌండ్ హీరోలతో కాదని ఆయన తెలుగులో సినిమాలు చేయలేదు.
గీత ఆర్ట్స్ 2 ఆవిర్భవించాక నాని మొదలుకుని విజయ్ దేవరకొండ దాకా అందరితో చేస్తున్నారు కానీ గీత ఆర్ట్స్ కున్న బ్రాండ్ వేల్యూ దీనికి లేదన్నది వాస్తవం. కారణం అల్లు అరవింద్ భాగస్వామి అయినప్పటికీ నిర్మాతగా బన్నీ వాసు ఉంటారు కాబట్టి.
నిజానికి దర్శకులకు గీత ఆర్ట్స్ లో చేయాలనే టార్గెట్ ఉంటుంది. కమిట్ అయితే ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా సెట్స్ పైకి తీసుకెళ్తారు అని ఆ బ్యానర్ కు ముందు నుంచే పేరు. కాని దర్శకులు ఎవరైనా ఈ సంస్థ సినిమాలలో మెగా హీరోలు మాత్రమే ఉంటారు. సరైనోడు-ధ్రువ తర్వాత మళ్ళి గీత ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమా రాలేదు.
గీతా ఆర్ట్స్ 2 పేరుతో వరస హిట్స్ వచ్చినా అల్లు అరవింద్ మాత్రం వన్ కు సంబందించిన అనౌన్స్ మెంట్ ఏదీ చేయడం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందే మూవీ ఇందులోనే ఉంటుందని అంటున్నారు కాని ప్రకటించే వరకు చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా గీత బ్యానర్ లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న దర్శకుల లిస్టు పెద్దదే ఉంది కాని ఎంట్రీ మాత్రం అంత సులభం కాదు