Begin typing your search above and press return to search.
శ్రీదేవిని అలా చూడలేకపోయాను: అరవింద్
By: Tupaki Desk | 5 March 2018 3:30 PM GMTఅతిలోక సుందరి జ్ఞాపకాలు అందరిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అస్థికలు రామేశ్వరంలో కలిపాక కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా తన గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టి.సుబ్బరామి రెడ్డి నిర్వహించిన సంస్మరణ సభ దీనికి వేదికైంది. ఇందులో పాల్గొన్న నటీనటులు శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని, ఆవిడలో గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ హృదయాలను బరువెక్కించారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా ఇందులో జాయినయ్యారు. తాను నిర్మాత అశ్విని దత్ ఒకసారి శ్రీదేవి ఇంటికి వెళ్ళినప్పుడు బాయ్ తెచ్చిన టీ ని స్వయంగా తన చేతులతో తీసుకుని ఇస్తున్న శ్రీదేవిని చూసి మనసు కలత చెందిందని ఇదే విషయం అశ్విని దత్ తో అంటే ఆవిడ సింప్లిసిటి అలాగే ఉంటుందని చెప్పారట.
బహుశా ఈ సంఘటన అల్లు అరవింద్ ఎస్పి పరశురాం సినిమాకు డేట్స్ అడగడానికి వెళ్ళినప్పుడు జరిగి ఉండవచ్చు. గీతా ఆర్ట్స్ కాకుండా తన సిస్టర్ కన్సర్న్ బ్యానర్ గా ఉన్న సాయి చరణ్ మూవీస్ పేరు మీద తీసిన ఆ మూవీలో చిరంజీవి సరసన హీరొయిన్ గా శ్రీదేవి నటించింది. ఆ సందర్భంలోనే అల్లు అరవింద్ తనని కలిసి ఉండచ్చు. అప్పటికే సీనియర్ నిర్మాతగా అల్లు అరవింద్ తెలుగులో ఎన్నో భారీ సినిమాలు నిర్మించినప్పటికీ శ్రీదేవితో మాత్రం చేయలేకపోయారు. ఆ కల ఎస్పి పరశురాంతో నెరవేరింది. కాని దురదృష్టవత్తు తమిళ్ - హింది లో ఘన విజయం సాధించిన ఆ మూవీ తెలుగులో మాత్రం చిరు లాంటి హీరో ఉన్నా ఫ్లాప్ అయ్యింది.
ఇక్కడ సభలో అల్లు అరవింద్ వర్మ ప్రస్తావన తీసుకురావడం విశేషం. వర్మ గురించి ఇంతకు ముందు ఎలాంటి అభిప్రాయం ఉండేది అనేది పక్కన పెడితే వర్మ లేఖ చదివాక అతనిది ఎంత గొప్ప అభిమానమో అర్థమైందని చెప్పడం విశేషం.పనిలో పనిగా వర్మ హృదయం మెత్తనిది అంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు అరవింద్.