Begin typing your search above and press return to search.

అది అల్లు అర‌వింద్ నిర్ణ‌య‌మేన‌ట‌

By:  Tupaki Desk   |   28 July 2018 8:52 AM GMT
అది అల్లు అర‌వింద్ నిర్ణ‌య‌మేన‌ట‌
X
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన `గీత గోవిందం` విడుద‌ల‌కి ముందు మంచి బ‌జ్‌ ని క్రియేట్ చేసింది. ఆ ఊపులోనే ఆడియో వేడుక‌ని జ‌రిపి... విజ‌య‌వంతంగా చిత్రాన్ని విడుద‌ల చేసి హిట్టు కొట్టాల‌నుకుంది టీమ్‌. అయితే ఇంత‌లో అనుకోకుండా ఆ చిత్రాన్ని వివాదం చుట్టుముట్టింది. అయితే అది ఇంకాస్త ముద‌ర‌కుండా అల్లు అర‌వింద్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. విజ‌య్ దేవ‌ర‌కొండ స్వ‌యంగా పాడిన వాట్ ద ఎఫ్‌... పాట గురించే వివాదం క్రియేట్ అయింది. శ్రీమ‌ణి రాసిన ఆ పాట‌లో అభ్యంత‌ర‌క‌ర‌మైన పంక్తులు ఉన్నాయ‌ని - కొంత‌మంది ఆవేదన వ్య‌క్తం చేశారు. సోష‌ల్ నెట్వ‌ర్కింగ్ సైట్ల‌లో కూడా అందుకు సంబంధించి అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే ఆ వివాదం ముదిరి పాకాన ప‌డ‌క‌ముందే అల్లు అర‌వింద్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించారు. ఆ పాట‌ని యూ ట్యూబ్ నుంచి తొల‌గించేలా చేశారు. పాట‌లో ఉన్న ప‌దాల్ని మార్చి మ‌ళ్లీ అప్‌ లోడ్ చేస్తామ‌ని చిత్ర‌బృందంతో ప్ర‌క‌టింప‌జేశారు. దాంతో వివాదానికి పుల్‌ స్టాప్ ప‌డింది. లేదంటే మాత్రం వివాదం పెద్ద‌దై - అది సినిమా విడుద‌ల‌పై కూడా ప్ర‌భావం చూపుండేద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంటున్నాయి. చిత్ర‌బృందం మాత్రం అల్లు అర‌వింద్‌ కి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతోంది. ``అల్లు అర‌వింద్ గారికి అన‌వ‌స‌ర‌మైన వివాదాలు న‌చ్చ‌వు. ఎవ‌రి మ‌నోభావాలైనా దెబ్బ తింటాయ‌ని తెలిసిన‌ప్పుడు అలాంటి కంటెంట్‌ని ఆయ‌న ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్రోత్స‌హించ‌రు. ఆయ‌న‌వ‌ల్లే వాట్ ద ఎఫ్... పాట వివాదం స‌ద్దుమ‌ణిగింద‌``ని చిత్ర‌బృందంలోని ఒక‌రు చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఆడియో కార్య‌క్ర‌మం రేపు హైద‌రాబాద్‌ లో జ‌రుగుతుంది. ఆగ‌స్టు 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు.