Begin typing your search above and press return to search.
ఈ టాలెంట్ కొడుకు కోసం వాడితే..
By: Tupaki Desk | 10 Nov 2015 1:30 PM GMTటాలీవుడ్ నిర్మాతల్లో అల్లు అరవింద్ కు స్పెషల్ నేమ్ ఉంది. స్క్రిప్ట్ లను జడ్జ్ చేయడంలో.. అల్లును మించినోళ్లను లేరనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాల లిస్ట్ చూస్తే.. ఈ విషయాన్ని నమ్మక తప్పదు. ఎప్పుడో ఒకటీఆరా తప్ప.. మిగిలిన అన్నిసార్లు తాను అనుకున్నదానికంటే పెద్ద రిజల్ట్ నే రాబట్టారు అల్లు అరవింద్. రీసెంట్ గా భలేభలే మగాడివోయ్ మూవీని జీఏ2 పేరుతో ఓ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసి మరీ తీశారాయన. నిజానికి ఈ స్క్రిప్ట్ మొదట విన్నది డీవీవీ దానయ్య అంటారు.
ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న తనీఒరువన్ రీమేక్ లోకి కూడా ఈయన ఇలాగే ఎంటర్ అయ్యారు. నమ్మిన ప్రాజెక్టులని అంత సీరియస్ గా తీసుకుంటారు అల్లు. అయితే.. ఈయనకు ఇంతటి ప్రతిభ ఉన్నా.. తన కొడుకు విషయంలో మాత్రం ఇది పనికి రావడంలేదు. అల్లు శిరీష్ ని సక్సెస్ ఫుల్ హీరోగా తీర్చదిద్దడంలో మాత్రం అల్లు ఫెయిల్ అవుతున్నారు. కొత్త జంట పేరుతో మారుతీతో తీసిన మూవీ హిట్ అనిపించుకున్నా సరే.. దానితో శిరీష్ కెరీర్ కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. తర్వాత సినిమా కూడా లేదు.
మరోవైపు మెగా క్యాంప్ నుంచి ఆ తర్వాత ఎంటర్ అయిన వరుణ్ తేజ్ - సాయి ధరం తేజ్ లు క్రేజ్ సంపాదించేసుకుని దూసుకుపోతున్నా.. అల్లు శిరీష్ మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతూనే ఉన్నాడు. ఇక అల్లు రంగంలోకి దిగి ఓ మాంచి స్క్రిప్ట్ ను పట్టేసి అయినా.. శిరీష్ కెరీర్ ని ట్రాక్ పెట్టాల్సిన అవసరం ఉంది.