Begin typing your search above and press return to search.
కాంతార సెంటిమెంట్.. మరో అల్లు ప్లాన్!
By: Tupaki Desk | 19 Jan 2023 7:30 AM GMTసినిమా నిర్మాతలందు అల్లు అరవింద్ వేరయ్య అంటూ ఉంటారు... ఆయన ప్రొడక్షన్ స్ట్రాటజీ తెలిసిన వారంతా. తండ్రి ఒక స్టార్ కమెడియన్ అయినా నటన వైపు ఆసక్తి చూపించకుండా ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థను మరింత వృద్ధి పరుస్తూ ముందుకు వెళ్లాడు. అల్లు అరవింద్ ఏ సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది ఎలాంటి సినిమా ఎంత బడ్జెట్‌తో చేయాలి వాటి విషయాలను వెన్నతోనే వంట పట్టించుకున్న ఆయన... ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నీ మంచి హిట్లుగా నిలుస్తున్నాయి. దానికి తోడు ఇతర భాషలలో సూపర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలను తెలుగు భాషలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆయన మరింత పేరు తెచ్చుకున్నాడు.
తాజాగా గత ఏడాది కాంతారా అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్న అల్లు అరవింద్... ఈసారి ఒక మలయాళ సినిమా మీద దృష్టి పెట్టారు. వాస్తవానికి కాంతార తర్వాత బేడియా అనే సినిమా రిలీజ్ చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన మాలికాపురం అనే ఒక మలయాళ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ, యశోద సినిమాలతో మలయాళ హీరో ఉన్నిముకుందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. అలా ఉన్ని లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రమే మాలికాపుర. 2022 డిసెంబర్ 30న ఈ సినిమా మలయాళంలో విడుదలైంది. విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేరళలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
మామూలుగానే మలయాళ సినిమాలకు చాలా బడ్జెట్ తక్కువగా ఉంటుంది. ఈ సినిమాని కూడా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్లో పూర్తి చేయగా కేవలం కేరళ థియేటర్ల నుంచి దాదాపు 40 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులో డబ్బింగ్ చెప్పించి ఈ నెల 21వ తేదీన గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. మాలికాపురం అంటే అయ్యప్పను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపించిన చిన్నారి, ఆమెను కేరళలో దేవతాశక్తిగా పూజిస్తారు.
ఇప్పటికీ శబరిమలలో అయ్యప్ప దేవాలయంతో పాటు మాలికాపురం ఆలయం కూడా ఉంది. ఈ కథ కూడా అయ్యప్పను ఒక చిన్నారి కలుసుకునే నేపథ్యంలోనే జరగబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో సజ్జు కురూప్, మనోజ్ కే జయన్, రంజి పానికర్, రమేశ్ పిషరోడి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ మరో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.