Begin typing your search above and press return to search.
అల్లు అరవింద్ జాలి పడి వదిలేశాడా?
By: Tupaki Desk | 13 Jun 2017 4:58 AM GMT'రాబ్తా' సినిమాను ఒక్కసారి చూస్తే చాలు.. ఓహో ఇది మగధీర కు భలే స్టయిలిష్ ఫ్రీమేక్ అని అర్ధమైపోతుంది. ఇక్కడ హీరోయిన్ జాబ్ లెస్ హీరో మాత్రం ఏవో స్టంట్లు చేస్తుంటాడు. అదే బాలీవుడ్ లో అయితే హీరో ఒక బ్యాంకర్ హీరోయిన్ ఒక చాక్లెట్ మిక్సర్. అంటే ఫారన్లో జాబులున్న ఇండియా సంతతివారు అన్నట్లు చూపించారనమాట. అయితే ఈ సినిమాపై అల్లు అరవింద్ కేసును ఎందుకు విత్ డ్రా చేసుకున్నాడు అనే విషయంపై ఇప్పుడు కొన్ని గాట్టి వార్తలు బాలీవుడ్ కాలమ్న్స్ లో వినిపిస్తున్నాయి.
గత శుక్రవారం రిలీజైన రాబ్తా సినిమా ఇప్పటివరకు కేవలం 15 కోట్ల నెట్ వసూళ్ళను రాబట్టింది. అంటే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదనమాట. అయితే ఈ సినిమాపై కోర్టులో కాపీరైట్ కేసు నడుస్తున్నప్పుడు.. వాదనలు జరుగుతున్నప్పుడు.. మధ్యలో అల్లు అరవింద్ కు సినిమా చూపించారు. ఆయన వెంటనే కేసును ఉపసంహరించకున్నారు. చూస్తుంటే.. ఆ సమయంలో సినిమా చూసి ఇదెలాగో ఫ్లాపయ్యే సినిమా అని అరవింద్ జాలి పడ్డారని అనుకోవచ్చా? సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఒక బాలీవుడ్ మీడియా.. సినిమా రిజల్టు ముందే తెలుసు కాబట్టే.. మగధీర కాంట్రోవర్శీని పబ్లిసిటీకి బాగా వాడేసుకున్నారు అంటూ రాసుకొచ్చింది.
మొత్తానికి సినిమాను పూర్తి స్థాయిలో కాపీ చేయకుండా.. సోల్ వదిలేసి ఎలిమెంట్స్ లేపేస్తే.. అది వర్కవుట్ కాదు. కాని రైటర్స్ సిద్దార్ధ్ అండ్ గరిమా మాత్రం.. అబ్బే మేం చించేసే రేంజులో రాశాం అంటూ ఇంకా కబుర్లు చెబుతున్నారు. కాంట్రోవర్శీతో మా సినిమా రిలీజ్ ఆపేద్దాం అని కుట్ర జరిగింది అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు. వామ్మో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/