Begin typing your search above and press return to search.
భలే భలే.. ఆ సీన్ తీసేశారట
By: Tupaki Desk | 10 Sep 2015 9:56 AM GMTదాదాపు రెండుంపావు గంటల పాటు ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తింది ‘భలే భలే మగాడివోయ్’. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోవడంలోనే ఈ సినిమా విజయం దాగుంది. సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంతో ప్రేక్షకుడు కనెక్టయ్యాడు. కడుపుబ్బ నవ్వాడు. ఐతే ఇలాంటి మరో కామెడీ సన్నివేశాన్ని నిడివి తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎడిటింగ్ లో తీసేశామని చెప్పాడు అల్లు అరవింద్. ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్ మీట్ లో భాగంగా నాని కమిట్ మెంట్ గురించి మాట్లాడుతూ ఈ సంగతి వెల్లడించాడు.
‘‘నేటి తరం నటుల్లో నాని ఫైనెస్ట్ యాక్టర్. తనకు సినిమా బాగుండాలి. దాని కోసం ఏమైనా చేస్తాడు. అందుకు ఓ ఉదాహరణ చెబుతా. భలే భలే మగాడివోయ్ లో అతను చాలా బాగా నటించిన కామెడీ సీన్ ఒకటుంది. కానీ ఎడిటింగ్ లో ఆ సీన్ తీసేయాలనుకున్నాం. ఐతే నాని ఫీలవుతాడేమో అనుకున్నా. కానీ అతను మాత్రం సినిమా బాగా రావడానికి ఏమైనా చేద్దాం అన్నాడు. సినిమా విషయంలో అతడికున్న కమిట్ మెంట్ నాకు చాలా బాగా నచ్చింది’’ అని చెప్పాడు అరవింద్.
భలే భలే మగాడివోయ్ సినిమాను తాము షార్ట్ గా బీబీఎం అని పిలుచుకున్నామని.. ఐతే ఆ షార్ట్ కట్ పేరుకు ప్రేక్షకులు అర్థమే మార్చేశారని.. ‘బ్లాక్ బస్టర్ మూవీ’ అనే కొత్త అర్థం తెచ్చారని నాని చెప్పాడు. సినిమా హిట్టవుతుందనుకున్నానని.. కానీ ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదని నాని చెప్పాడు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘గీతా ఆర్ట్స్ నాకు మాతృ సంస్థ లాంటిది. ఈ బ్యానర్ లో చేసిన ‘కొత్త జంట’ సినిమా అనుకున్నంతగా హిట్టవలేదు. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టి తీరాలన్న కసితో ఈ సినిమా చేశా. నాని కూడా సినిమా విజయవంతం కావడడానికి కీలకమైన సలహాలిచ్చి ముఖ్య పాత్ర పోషించాడు’’ అని చెప్పాడు.