Begin typing your search above and press return to search.
నా కొడుకులతో సమానం -అరవింద్
By: Tupaki Desk | 19 April 2018 4:44 AM GMTయూత్ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలో అయినా యూత్ కు విపరీతంగా కనెక్టయ్యే క్యారెక్టర్లతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడు విజయ్ దేవరకొండ కాదు.. విజయ్ బంగారుకొండ అంటూ మెగా నిర్మాత అల్లు అరవింద్ కాంప్లిమెంట్ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అల్లు అరవింద్ కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు.
‘‘యూత్ ఐకాన్ మాటకు పర్ ఫెక్ట్ సూటయ్యే పర్సన్ విజయ్ దేవరకొండ. అతడు మాట్లాడితే జెన్యూన్ గా ఉంటుంది. అతడి ఫీలింగ్ జెన్యూన్ గా ఉంటుంది. మనిషి జెన్యూన్ గా ఉంటాడు. నా కొడుకులతో సమానమైన యాక్టర్’’ అంటూ అరవింద్ విజయ్ దేవరకొండను పబ్లిక్ మీటింగ్ లో తెగ మెచ్చుకున్నారు. ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ కథ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయ్యానని.. ఇందులో తాను ఇన్వాల్స్ అయితే తన ఆలోచనలు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సినిమా షూటింగ్ అయ్యేంతవరకు దూరంగానే ఉన్నానని అరవింద్ చెప్పుకొచ్చారు. సినిమాలో తాను వేలు పెట్టకపోవడమే డైరెక్టర్ కు ఇచ్చిన పెద్ద కానుక అన్నారు.
డైరెక్టర్ రాహుల్ - విజయ్ దేవరకొండ వీరిద్దరే ఈ సినిమాకు సంబంధించి మొత్తం వ్యవహారాలు ముందుండి చూసుకున్నారని.. తాను ఇంకా సినిమా కూడా చూడలేదని.. తరవాతే చూస్తానని అరవింద్ క్లియర్ కట్ గా చెప్పారు. బాహుబలి సినిమాతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తెలుగు సినిమా స్థాయిని తగ్గించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారంటూ చివరిలో అరవింద్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. గీతా ఆర్ట్స్ 2- యువి క్రియేషన్స్ సంయుక్తంగా టాక్సీవాలా సినిమాను నిర్మించాయి.