Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ ముందే ఊహించారా?

By:  Tupaki Desk   |   9 Oct 2019 5:07 AM GMT
అల్లు అరవింద్ ముందే ఊహించారా?
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' విడుదలై ఇప్పటికి వారం రోజులయింది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఫైనల్ గా ఒక సినిమా సంగతి ఏంటో తెలుసుకోవాలంటే బాక్స్ ఆఫీస్ లెక్కల సంగతి మాట్లాడకతప్పదు. 'సైరా' దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని ఫిలిం మేకర్స్ అంటున్నారు. నాన్ - థియేట్రికల్ రైట్స్ సంగతి పక్కన పెడితే థియేట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్మిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది కానీ బ్రేక్ ఈవెన్ కు ఆ కలెక్షన్స్ చాలవు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మరోవైపు దసరా సీజన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు.. కర్ణాటక తప్ప మరే ఇతర ప్రాంతంలోనూ ఈ సినిమా కలెక్షన్ అంచనాలను అందుకోలేదు. ఒవరాల్ గా చూస్తే ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఈ సందర్భంగా సినీవర్గాలలో మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ఫలితాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందే ఊహించారని అందుకే ఈ సినిమాకు దూరంగా ఉన్నారని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినాను కరెక్ట్ గా అంచనా వేయగలిగిన వారిలో అరవింద్ ఒకరని.. వెటరన్ హీరోలకు ఈ ప్యాన్ ఇండియా సినిమాలు వర్క్ అవుట్ అయ్యే అవకాశం తక్కువనే సంగతి ఆయనకు క్లియర్ గా తెలుసు కాబట్టే ఆయన 'సైరా'కు దూరంగా ఉన్నారని అంటున్నారు. 'సైరా' చిరంజీవికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయం అరవింద్ గారికి 12 ఏళ్ళ క్రితమే తెలిసినా ఆ సినిమాను చిరు మార్కెట్ కంటే డబల్ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు రాకపోవడానికి కారణం అదేనని అంటున్నారు.