Begin typing your search above and press return to search.
వర్మవి చచ్చు తెలివితేటలు: అల్లు అరవింద్!
By: Tupaki Desk | 19 April 2018 2:43 PM GMTపవన్ కల్యాణ్ ను నటి శ్రీరెడ్డి దూషించడం వెనుక తానే కర్త, కర్మ, క్రియ అని వివాదాస్పద దర్శకుడు వర్మ చేసిన ప్రకటన టాలీవుడ్ లో పెను ప్రకంపనలు రేపింది. శ్రీరెడ్డి, వర్మల పై పవన్ ఫ్యాన్స్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వర్మపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రశాంతంగా ఉండే అల్లు అరవింద్ ....వర్మపై విరుచుకుపడ్డారు. మెగా ఫ్యామిలీపై వర్మ ఎప్పటినుంచో కక్ష గట్టాడని, దానికి పరాకాష్టగా పవన్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయించాడని ఆయన మండిపడ్డారు. వర్మ పేరు బయటకు వచ్చింది కనుకే తాను నిజాయితీపరుడుని నిరూపించుకోవడానికే తన తప్పును ఒప్పుకున్నాడని దుయ్యబట్టారు. ఆ వీడియో ద్వారా వర్మ చచ్చు తెలివితేటలు బయటపడ్డాయని - వర్మ బూటకం బట్టబయలైందని అల్లు అరవింద్ నిప్పులు చెరిగారు.
దగ్గుబాటి ఫ్యామిలీ పేరు చెడిపోకుండా ఉండేందుకు 5 కోట్ల సెటిల్మెంట్ చేశానని వర్మచెప్పాడని, అయితే మెగా ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచించలేదని అన్నారు. అసలు ఆ సెటిల్మెంట్ గురించి సురేష్ కు తెలీదని వర్మ చెప్పాడని, ఆ డబ్బు వర్మకు ఎక్కడనుంచి వచ్చిందని నిప్పులు చెరిగారు. పవన్ ను శ్రీరెడ్డి చేత అంతమాట అనిపించారని, అదే వర్మ తల్లినో...అక్కనో - కూతురినో ఇలాంటి తిట్టు తిడితే ఊరుకుంటాడా అని అడిగారు. వర్మ నీచ స్థాయికి తాము దిగజారలేమని, అందుకే ఇంతకు మించి దిగజారి మాట్లాడలేనని ఆయన అన్నారు. తెలుగు సినిమానే వర్మకు పేరు తెచ్చిందని అటువంటిది పాలు తాగి రొమ్ము గుద్దుతున్నాడని అన్నాఉ. టాలీవుడ్ సిగ్గు పడే వ్యవహారంలో కీలక పాత్రధారి. అయిన వర్మపై పరిశ్రమ పెద్దలు ఏం చర్య తీసుకుంటారో వేచి చూడాలని చెప్పారు. పీఆర్‌పీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ తరహా కుట్రలు చూశానని అన్నారు. పవన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడని,. అతడి నిర్ణయాన్ని గౌరవించి తామంతా దూరంగా ఉంటున్నామని, పవన్ పై ఈ వ్యాఖ్యలు చేయడంతోనే తాము ముందుకు వచ్చామని అన్నారు.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి