Begin typing your search above and press return to search.
అరవింద్ సాబ్ స్ర్టాటజీతో `కాంతార` రిలీజ్!
By: Tupaki Desk | 10 Oct 2022 2:30 AM GMT`కేజీఎఫ్` బ్యానర్ నిర్మించిన `కాంతార` కన్నడలో సంచలన హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన సినిమా స్టిల్ వసూళ్లతో దూసుకుపోతుంది. మెట్రోపాలిటన్ సిటీస్ లో కన్నడ వెర్షన్ టిక్కెట్ల కోసం జనం క్యూ కట్టిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం తప్పదు. 16 కోట్లతో తెరకెక్కిన సినిమా 60 కోట్ల వసూళ్లని సునాయాసంగా సాధించింది. పాన్ ఇండియన్ చిత్రంగా కేజీఎఫ్ బ్యానర్ రిలీజ్ చేస్తే అదే స్థాయిలో సక్సెస్ అందుకునేది.
కానీ ఈసారి సదరు బ్యానర్ స్థానికంగానే సినిమాని పరిమితం చేసింది. ఇతర భాషల్లో వేర్వేరు సంస్థలకు అనువాద హక్కులు కల్పించడంతో తెలుగు వెర్షన్ రైట్స్ గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ దక్కించుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్..ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కన్నడ వెర్షన్ రెస్పాన్స్ చూసి అరవింద్ ఈ చిత్రాన్ని వీలైనం త్వరగా తెలుగు ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే శనివారం `కాంతార` రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఏపీ-తెలంగాణలో `గాడ్ పాదర్` హవా నడుస్తోంది. ఈ వారం రోజులు గాడ్ ఫాదర్ దే అప్పర్ హ్యాండ్. ఆ రకంగా మెగా క్లాష్ ఎక్కడా కనిపించదు. ఇక నాగార్జున నటించని ది ఘోస్ట్...యువ నటుడు బెల్లంకొండ గణేష్ నటించిన `స్వాతిముత్యం` సినిమాలు యావరేజ్ గా ఆడుతున్నాయి.
అయితే `కాంతార` రిలీజ్ సమయానికి ఈ రెండు సినిమాలు ఆడుతోన్న థియేటర్లు కొంత వరకూ క్లియర్ చేసే అవకాశం ఉంది. పైగా అరవింద్ కి సొంత థియేటర్ వ్యవస్థ ఉంది కాబట్టి కాంతర భారీ స్పాన్ లో నే రిలీజ్ అవుతుంది. వాటితో పాటు..ఖాళీ అయ్యే థియేటర్లను కాంతార ఆక్యుపై చేసే ఛాన్స్ ఉంది.
`కాంతార` ని ఇప్పట్లో రిలీజ్ చేయాలా? లేదా? అని కొన్ని రకాల సందేహాలు వెంటాడినప్పటికీ కన్నడ వెర్షన్ టాక్ నేపథ్యంలో వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే మంచి ఫలితాలు చూడొచ్చని అరవింద్ పక్కా ప్లానింగ్ తో రింగులోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగు వెర్షన్ `కాంతార` ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.