Begin typing your search above and press return to search.
శ్రీ లీక్స్ - అల్లు అరవింద్ స్పందన !
By: Tupaki Desk | 19 April 2018 5:09 AM GMTఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు ఇప్పటివరకు వచ్చాయి. కానీ ఎక్కువ మంది పెద్దలు బయటకు వచ్చి స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే, శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ విషయం తెరమీదకు తెచ్చినప్పటి నుంచి అది అనేక మలుపులు తిరిగింది. చాలా మంది మీద నిందలు పడ్డాయి. దీంతో ఎవరికి వారు తమంతట తామే స్పందిస్తూ వచ్చారు. తాజాగా శ్రీరెడ్డి బాహుబలి ఫేమస్ హీరోయిన్ అంటూ పెట్టిన వీడియో ఇండస్ట్రీని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ వీడియో నిజమా - కాదా అనే విషయం కూడా నిర్దారణ కాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు వల్ల నిజాలు తేలేలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించంగా - తాజాగా అల్లుఅరవింద్ వాటితో పాటు బాహుబలి విషయంపై కూడా స్పందించి... దయచేసి ఇండస్ట్రీని అవమానపరచకండి అని విజ్ఞప్తి చేశారు. ఆయన ఏమన్నారంటే...
ఎన్నో ఒడిదుడుకులను విమర్శలను దాటుకుంటూ పైకి వచ్చిన ఇండస్ట్రీ మనది. కొంత కాలం క్రితం బాహుబలి సినిమా విడుదలయ్యింది. అంతవరకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే తెలియని వారు కూడా తెలుగు ఇండస్ట్రీయా అంటూ ఆసక్తిగా మన వైపు చూశారు. దశాబ్దాల క్రితమే ఎన్నో ప్రయోగాలు చేశాం. ఎదుగుతూనే ఉన్నాం. బాహుబలితో ప్రపంచ సినిమాలతో పోటీ పడే స్థాయికి వెళ్లిన మన ఇండస్ట్రీకి చెడు రోజులు ఇవి.
తప్పులు లేవు అని నేను చెప్పను గానీ... ఎక్కడో ఒకరూ ఇద్దరూ అలాంటి వారు ఉంటే వారి మూలంగా మొత్తం ఇండస్ట్రీని అవమానపరచడం చాలా తప్పు. తెలుగు సినిమాను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన బాహుబలి వంటి సినిమాకు మచ్చలు తెచ్చే పని చేయబూనడం తప్పు. అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే... మనం, నాతో సహా ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నాం. ఎవరో చాలా తక్కువ శాతంలో జరిగే తప్పులను పెద్దవిగా చేసి చూపి ఇండస్ట్రీని అవమానపరచకండి. ఇండస్ట్రీలో ఉన్న వారికి, ఆధారపడేవారికి, మీడియాకు ఇది నా ప్రత్యేక విజ్ఞప్తి... అంటూ అల్లు అరవింద్ కోరారు.