Begin typing your search above and press return to search.

తనకు కరోనా సోకిందనే వార్తలపై స్పందించిన అల్లు అరవింద్..!

By:  Tupaki Desk   |   5 April 2021 5:42 PM IST
తనకు కరోనా సోకిందనే వార్తలపై స్పందించిన అల్లు అరవింద్..!
X
గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాసుకొచ్చారు. ఇలాంటి వార్తలు వస్తుండటంతో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కోవిడ్ వ్యాక్సిన్ పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ ఓ వీడియో ద్వారా కోవిడ్ సోకిందనే వార్తలపై స్పందించారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''నాకు కరోనా వచ్చిందని ఈ మధ్య వస్తున్న వార్తలపై స్పందించడానికి ముందుకొచ్చాను. నాకు కరోనా వచ్చిన మాట నిజమే. కరోనా వ్యాక్సినేషన్ ఒక డోసు తీసుకున్న తర్వాత ఇద్దరు స్నేహితులతో కలిసి ఊరు వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చాక మా ముగ్గురికి కరోనా వచ్చింది. అయితే మా ముగ్గురిలో ఇద్దరం రెండు రోజుల ఫీవర్ తో సేఫ్ గా ఉన్నాం. ఒకరు మాత్రం హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారు. మేమిద్దరం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మాపై వైరస్ ప్రభావం చూపలేదు. మా ఫ్రెండ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు'' అని తెలిపారు.

''కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా ప్రభావం ఎక్కువ ఉండదు. వ్యాక్సినేషన్ చేయించుకున్నా కొందరికి కరోనా లైట్ గా వస్తోంది. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే కచ్చితంగా ప్రాణహాని నుంచి బయట పడతాం. దీనికి నేనే ఉదాహరణ. అందుకే అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి'' అని అల్లు అరవింద్ పిలుపునిచ్చారు.