Begin typing your search above and press return to search.
చరణ్ కు 25 కోట్లు .. సేఫ్ గేమ్
By: Tupaki Desk | 15 Nov 2015 5:11 AM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు ఏ రేంజులో బడ్జెట్ ఖర్చు చేయాలి. లాభాలు రాకపోయినా కనీసం డిస్ర్టిబ్యూటర్ లు - బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే వాస్తవ బడ్జెట్ ఎంత ఉండాలి? ఇప్పుడు చరణ్ సినిమాను చూస్తే ఈ విషయంపై క్లారిటీ రావచ్చేమో.
ఇటీవలే రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ కొన్ని పాఠాల్ని నేర్పిందని చెబుతున్నారు. ఈ సినిమా ఫ్లాపయినా 41 కోట్లు షేర్ ఇప్పటివరకు వసూలు చేసింది. అయితే కాస్ట్ కంట్రోల్ లేకుండా ఈ సినిమాని తీయడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అదుపు తప్పింది. అందుకే సుమారు 56 కోట్ల మేర బిజినెస్ చేశారు. అంటే డిఫరెన్స్ దాదాపు 15 కోట్లు కనిపిస్తోంది. ఆ మేరకు బయ్యర్లకు వచ్చిన నష్టమెంతో అంచనా వేయొచ్చు. అందుకే బ్రూస్ లీ ఫ్లాపవ్వగానే అప్పటికే లైన్ లో ఉన్న తని ఒరువన్ రీమేక్ నుంచి డి.వి.వి.దానయ్య ఎస్కేప్ అయ్యారు. ఆ ప్లేస్ లో బాస్ అల్లు అరవింద్ లైన్ లోకొచ్చారు. గీతా ఆర్ట్స్ లో ఆ సినిమాని నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారిప్పుడు.
అరవింద్ రంగంలోకి దిగాక.. కాస్ట్ కంట్రోల్ కోసం ఓ కొత్త ఎత్తుగడ వేస్తున్నారిప్పుడు. చరణ్ సినిమాని రూ.25 కోట్ల బడ్జెట్ లో నిర్మించగలిగితే బయ్యరు సేఫ్ గా ఉంటాడన్నదే ఆ ప్లాన్. అంటే చరణ్ రెమ్యునరేషన్ తో పని లేకుండా పాతిక కోట్లు ఖర్చు చేయాలి. అప్పుడు సినిమాని సేఫ్ మార్కెట్ చేయొచ్చు. కొనుక్కున్నవాళ్లకు నష్టాలు రాకుండా కాపాడ వచ్చు అన్నది ప్లాన్. మిగతా స్టార్లకు ఇదే వర్తిస్తుంది. ఇప్పుడర్థమైందా?