Begin typing your search above and press return to search.
అల్లు అరవింద్ కల ఇప్పటికైనా నెరవేరేనా?
By: Tupaki Desk | 18 Oct 2022 5:30 PM GMTమెగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు, ఓ బ్రాండ్ వాల్యూ వుంది. ఆయన ప్రముఖ సీనియర్ హాస్య నటులు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా నటుడిగా కాకుండా స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. తనదైన మాస్టర్ ప్లాన్ లతో భారీ సినిమాలని తెరకెక్కించి బ్లాక్ బస్టర్లుగా మలిచిన ఘనత ఆయన సొంతం. రీసెంట్ గా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.
ఇదే సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి నిర్మించయబోతున్న రామాయణం గురించి వెల్లడించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అత్యధిక సిమాలు చేసింది చిరంజీవిగారితోనే నని, ఆయనతో చేసిన సినిమాల్లో దాదాపు అన్ని సూపర్ హిట్లేనని తెలిపారు. అంతే కాకుండా తన జీవితంలో బ్రహ్మాండమైన సినిమా తీశానన్న సంతృప్తిని `మగధీర` ఇచ్చిందన్నారు. అంతే కాకుండా గత కొన్నేళ్లుగా తను చేయాలనుకుంటున్నడ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టారు.
మా బ్యానర్ లో చరణ్ - అర్జున్ కలిసి నటిస్తే బాగుంటుంది. అది నా కోరిక. ఆ ప్రాజెక్ట్ కు పదేళ్ల క్రితమే `చరణ్ - అర్జున్` అని పేరు పెట్టుకున్నా. అది ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుందనే నమ్మకం వుంది. అంటే గత పదేళ్లుగా ఈ టైటిల్ ని అల్లు అరవింద్ ఛాంబర్ లో రెన్యువల్ చేస్తూనే వున్నారన్న మాట. బన్నీ, చరణ్ కలిసి తొలిసారి `ఎవడు` మూవీలో నటించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అరవింద్ ఈ ఇద్దరితో పూర్తి స్థాయి సినిమా చేయాలని ఆశపడుతున్నారు.
అది ఎప్పటికి నెరవేరుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా క్రేజ్ ని సొంతం చేసుకున్న నేపథ్యంలో బన్నీ, చరణ్ లతో భారీ మల్టీస్టారర్ అన్నది అసలు సమస్యే కాదు. కానీ ఫ్యాన్స్ ఏ ఒక్కరి పాత్ర తగ్గి మరొకరి పాత్రకు ప్రాధాన్యత పెరిగినా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా వుండదు. ఇటీవల `RRR` విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే అల్లు అరవింద్ ఇదే ఇంటర్వ్యూలో రామాయణం ప్రాజెక్ట్ పై కూడా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గత నాలుగేళ్లుగా జరుగుతున్నాయని, ఇది చాలా పెద్ద ప్రయత్నం.. ఇది పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడతాయి. అయితే ఈ సినిమా భారతదేశంలోనే అతి పెద్ద.. భారీ బడ్జెట్ సినిమా అవుతుంది` అని స్పష్టం చేశారు అల్లు అరవింద్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.