Begin typing your search above and press return to search.

వసంత లక్ష్మి.. అల్లు అరవింద్ నమ్మకం

By:  Tupaki Desk   |   1 April 2018 12:42 PM IST
వసంత లక్ష్మి.. అల్లు అరవింద్ నమ్మకం
X
అల్లు అరవింద్ ను టాలీవుడ్లో జడ్జిమెంట్ కింగ్ అంటారు. అరవింద్ తరం నిర్మాతలు చాలామంది ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోగా.. ఆయన మాత్రం ఇంకా బలంగా నిలబడి ఉన్నారు. ఇప్పటికీ తిరుగులేని ట్రాక్ రికార్డుతో కొనసాగుతున్నారు. ఒక కథ విని అది వర్కవుటవుతుందా లేదా అని చెప్పడంలో.. ఆ కథలో మార్పులు చేర్పులు చేయించి పకడ్బందీగా తయారు చేయడంలో అరవింద్ ది అందెవేసిన చేయి అంటారు. ఐతే సినిమా రెడీ చేసే వరకు అరవింద్ పక్కాగా ఉండేలా చూసుకుంటే.. పూర్తయిన సినిమా ఫలితమేంటన్నది తెలుసుకోవడానికి అరవింద్ మరో వ్యక్తి మీద ఆధారపడతారట. ఆ వ్యక్తి పేరు వసంత లక్ష్మి అని వెల్లడైంది.

వసంత లక్ష్మి అంటే అరవింద్ మరో సోదరి. చిరంజీవి భార్య సురేఖకు అక్క. ఆమెకు సినిమాలపై మంచి అభిరుచి ఉందట. మెగా ఫ్యామిలీ హీరోలు ఏ సినిమా చేసినా ఆమెకు చూపిస్తారట. ఆమె తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబుతారట. ‘రంగస్థలం’ సినిమా చూసి ఆమె ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పారట. చిరుతో పాటు ఆమెకు కూడా ఈ సినిమా నచ్చడంతో తాను ఫలితంపై ధీమాగా ఉన్నానని దర్శకుడు సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకుముందు తాను తీసిన ‘ఆర్య’.. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలు కూడా బాగా ఆడతాయని వసంత లక్ష్మే చెప్పారని.. ఆమె మాటను అరవింద్ కుటుంబంలో అందరూ చాలా గౌరవిస్తారని.. సినిమా చూపించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకుంటారని సుకుమార్ వెల్లడించడం విశేషం.