Begin typing your search above and press return to search.
'అఖండ'చూసి అలా అనుకుంటే 'కార్తికేయ 2'ఇలా వచ్చేసింది!
By: Tupaki Desk | 17 Aug 2022 3:30 AM GMTనిఖిల్ హీరోగా చందూ మొండేటి రూపొందించిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
అల్లు అరవింద్ .. దిల్ రాజు కూడా ఈ సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా ఆడితే చాలా సంతోషపడిపోయేవాళ్లలో నేను ఒకడిని .. అందిలో నా స్వార్థం ఉంది. అదేంటంటే నిఖిల్ తో ఒక సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉంది. డైరెక్టర్ తో ఒక సినిమా లైన్లో ఉంది.
హీరో .. డైరెక్టర్ మాదిరిగా అనుపమ కూడా నా వైపుకు రావాలని అడుగుతున్నాను. ఆమె బిహేవియర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా నిర్మాతలను నేను అభినందిస్తున్నాను. హిందీలో ఈ సినిమాను సరదాగా ఓ 50 థియేటర్లలో రిలీజ్ చేస్తే, రెండో రోజున 200 థియేటర్లు .. ఈ రోజున 700 థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. భాషలు .
ప్రాంతాలు దాటుకుని ఈ సినిమా ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. సినిమాలో ఎంత సత్తా ఉందనేది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చును. 'పుష్ప' సినిమా కూడా ఇలాగే హంబుల్ గా స్టార్ట్ చేశారు .. వెళ్లి విరక్కొట్టేసింది.
'అఖండ' సినిమాను శివతత్వంపై ఎంతో ఎమోషనల్ గా తీసుకుని వెళ్లారు. ఆ సినిమాను చూసినప్పుడు మరో రెండు మూడేళ్లలో విష్ణుతత్వం పై కూడా ఎవరైనా సినిమా చేయవచ్చని అనుకున్నాను. నేను ఒక పెద్ద డైరెక్టర్ తో కూడా అన్నాను .. విష్ణుమూర్తిని ప్రధానంగా చేసుకుని సినిమా చేస్తే బాగుంటుందని. అందుకు సంబంధించిన చర్చ కూడా జరిగింది. కానీ ఒక ఏడాది కూడా కాకుండానే విష్ణుతత్వంపై ఇలాంటి సినిమా రావడం విశేషం. కథను యానిమేషన్ తో మొదలుపెట్టి దానిని సినిమాలోకి తీసుకుని వెళ్లడం బాగుంది.
హీరో .. హీరోయిన్ మధ్య రొమాన్స్ కామన్. కానీ ఆ సైడ్ వెళ్లకుండా ఇద్దరూ కలిసి ఒక కామన్ కాజ్ కోసం పరిగెత్తడం బాగుంది. వాళ్లిద్దరి వెంట మనం కూడా పరిగెడదాం అనిపించింది. సాహసంతో కూడిన ఒక కథకి పౌరాణికానికి సంబంధించిన బేస్ ఇచ్చి .. మళ్లీ దానిని కలికాలంలోకి తీసుకుని వచ్చి తమాషాగా తీశాడు. గ్రాఫిక్స్ .. కెమెరా వర్క్ చాలా బాగున్నాయి. ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. సినిమా మంచిదైతే జనాలు థియేటర్లకు వస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది" అంటూ చెప్పుకొచ్చారు.