Begin typing your search above and press return to search.
సైరా ఈవెంట్: అల్లూ వారి బాధకు కారణం?
By: Tupaki Desk | 22 Sep 2019 5:02 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన `సైరా నరసింహా రెడ్డి` అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ రిలీజవుతోంది. ఆదివారం సాయంత్రం సైరా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై మెగా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ని ఇచ్చారు. దాంతో పాటే.. ఆయన అన్న మాటను అభిమానులు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆయనేమన్నారు? అంటే..
సైరా చిత్రానికి పనిచేసిన వారు కాకుండా ఈ చిత్రాన్ని చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని నేనే. ఈ సినిమా సూపర్ హిట్. ముందు ఒక రకంగా భయంతో చూశాను. ఎప్పుడో కథ విన్నాను.. ఏం తీశారో అనే అనుమానం ఉండేది. కానీ సినిమా చూశాక చిరంజీవిని కౌగిలించుకొని ఏడ్చేశాను. సైరా సినిమా చూసిన తర్వాత రాంచరణ్ ను చూస్తే ఎమోషన్ కలిగింది. చిరంజీవి కంటే చరణ్ పై నాకు ఎమోషనల్‌గా ఫీలింగ్ కలిగింది. చిరంజీవితో చాలా సినిమాలు చేశాను. కానీ ఇలాంటి సినిమాలు తీయలేకపోయాననే బాధ కలిగింది అని అల్లు అరవింద్ అన్నారు.
అసలింతకీ `సైరా` చిత్రం నచ్చిందనే ఆనందంలోంచి పుట్టుకొచ్చిన బాధనా.. లేక తాను చేయాల్సిన 151 వ సినిమా ఆఫర్ చరణ్ లాక్కున్నారనో.. మొత్తానికి అయితే అల్లూ వారికి బాధ కలిగిందన్నది నిజం. నిజానికి చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా తీయాలని చాలా కాలంగా అల్లు అరవింద్ ఆసక్తిగా ఉన్నారు. వీలు కుదిరితే 150వ సినిమానే నిర్మించాలనుకున్నారు. కానీ చరణ్ సెంటిమెంటు అడ్డుపడింది. ఇక బోయపాటితో 151వ సినిమాకి ఆల్మోస్ట్ కథ ఫైనల్ అయినట్టేనని అప్పట్లో ప్రచారమైంది. అల్లు అరవింద్ స్వయంగా ఆ విషయాన్ని చెప్పారు. కానీ 151వ సినిమా చేజారింది. 152వ సినిమాకి అల్లు అరవింద్ కి అవకాశం లేదు. మెగాస్టార్ తో సినిమా చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ అంత సులువు కాదని ప్రూవైంది. అందుకేనేమో .. ఈ బాధ?