Begin typing your search above and press return to search.
2 భాషలు.. 3 బ్యానర్లు.. ముగ్గురు స్టార్లు
By: Tupaki Desk | 4 March 2017 4:45 AM GMTఅల్లు అర్జున్ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సారధ్యంలో నడిచే ఈ బ్యానర్ కు బోలెడంత వాల్యూ ఉంది. ఇప్పుడీ సంస్థ మరో రెండు నిర్మాణ సంస్థలతో కలిసి సినీ నిర్మాణాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలా భాగస్వామ్యాలతో సినిమాలు తీయడం అల్లుకు కొత్తేమీ కాదు కానీ.. ఈ సారి రూట్ వేరు.. టార్గెట్ వేరు.
ప్రభాస్ తన హోమ్ బ్యానర్ అని చెప్పే యూవీ క్రియేషన్స్.. అలాగే సూర్య సొంత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ లతో చేతులు కలపాలని గీతా ఆర్ట్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మూడు సంస్థలు కలిసి కొత్తగా ఒక ఉమ్మని నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. దీని ఉద్దేశ్యం ఏంటంటే.. అల్లు అర్జున్న.. ప్రభాస్.. సూర్యలతో సినిమాలు నిర్మించడమే. ఈ స్టార్లతో తెలుగు తమిళ భాషల్లో బైలింగ్యువల్స్ తీసేందుకు ఈ భాగస్వామ్యం సహకరిస్తుందని భావిస్తున్నారట.
ఈ కొత్త ఉమ్మడి బ్యానర్ పై తీసే సినిమాల్లో ఎక్కువగా హై బడ్జెట్ బై లింగ్యువల్ మూవీస్ ఉంటాయట. అలాగే ఆయా బ్యానర్లపై విడిగా కూడా నిర్మాణాలు చేసుకుంటారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ మూవీని యూవీ క్రియేషన్స్ తీయనుందనే సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ మార్కెట్ ను విస్తరించుకునేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు వీరంతా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/