Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ - మూడు మెగా సినిమాలు!

By:  Tupaki Desk   |   8 Aug 2018 10:51 AM GMT
గీతా ఆర్ట్స్ - మూడు మెగా సినిమాలు!
X

టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ ఒకటి. దశాబ్దాల చరిత్ర ఉన్న గీతా ఆర్ట్స్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉండడం ఒక విశేషమైతే - GA 2 పిక్చర్స్ అనే సబ్సిడరీ బ్యానర్ పై మీడియం - లో బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తుండడం ఒక విశేషం. ఈ బ్యానర్ పై తెరకెక్కిన 'గీత గోవిందం' త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు 'టాక్సీవాలా' కూడా మరో రెండు నెలల్లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

మరి గీతా ఆర్ట్స్ పై నిర్మించబోయే కొత్త సనిమాలు ఏవి? ఏ హీరోలతో అల్లు అరవింద్ ఇప్పుడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు? ఈమధ్య అల్లు అరవింద్ ఒక పర్సనల్ వర్క్ పై తాడేపల్లి గూడెం వెళ్ళాడు. అక్కడ ముచ్చటిస్తూ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెల్లడించాడు. చిరంజీవి తో ఒక సినిమా - బన్నీ తో ఇంకొకటి.. వరుణ్ తో మరో సినిమా ను ప్లాన్ చేసినట్టు తెలిపాడు అరవింద్.

చిరంజీవితో సినిమా 'సైరా' తర్వాత ఒక సినిమా నిర్మించే కమిట్మెంట్ ఉన్నప్పటికీ - చిరు కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కారణంగా అది డిలే అవుతోంది. కొరటాల శివ సినిమాను రామ్ చరణ్ - మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆ తర్వాత చిరు చేయబోయే సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. మరోవైపు అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లోనే చేస్తాడట. ఈ రెండిటితో పాటు వరుణ్ తేజ్ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తారట అల్లువారు. రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు.. ఓ మీడియం బడ్జెట్ సినిమా అన్నమాట!