Begin typing your search above and press return to search.
దేవి.. ఆయన కోరికెప్పుడు తీరుస్తాడో..
By: Tupaki Desk | 13 Sept 2015 12:24 PM ISTదేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి.. అతడి ఎనర్జీ గురించి.. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను స్టేజ్ ఎక్కాడంటే ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. కేవలం పాటలు పాడటం, హుషారెత్తించే మాటలు మాట్లాడ్డమే కాదు.. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో స్టెప్పులేస్తూ తను వేదికపై ఉన్నంతసేపు జనాలకు హుషారెత్తించడం దేవీకి అలవాటు. ఈ హుషారు చూసే దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పెట్టి సినిమా చేద్దామని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు నిర్మాతలు. కానీ అతను ఒప్పుకోవట్లేదు. ఐతే ఈ ప్రయత్నాలు చేస్తున్నవాళ్లలో అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత కూడా ఉన్న సంగతి చాలా లేటుగా జనాలకు తెలిసింది. నిన్న రామ్ సినిమా ‘శివమ్’ ఆడియో ఫంక్షన్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు అరవింద్.
దేవీకి తనకు మధ్య ఐదేళ్లుగా ఓ వ్యవహారం నడుస్తోందని అందరిలో ఆసక్తి రేపారు అరవింద్. అంటే ఏదైనా గొడవేమో అనుకున్నారు. కానీ ఆ గొడవ దేవిని హీరోను చేసే విషయంలో అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. హీరోగా మారే విషయమై తాను ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నానని.. ఐతే వచ్చే ఏడాది వచ్చే ఏడాది అనుకుంటూ దేవిశ్రీ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడని అన్నారు అరవింద్. వేదిక మీద దేవిని పక్కనబెట్టుకుని.. హీరోగా ఎప్పుడు చేస్తావో చెప్పు అంటూ ఇరకాటంలో పెట్టేశాడు అరవింద్. దేవి ఏమో నవ్వుతూ దాటవేసేశాడు. ఒకవేళ నిజంగా దేవి హీరోగా సినిమా చేస్తానంటే అరవిందే ముందుకొచ్చి నిర్మిస్తాడేమో చూడాలి. అయినా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి స్థితిలో ఉండగా ఆర్పీ పట్నాయక్ నటనలోకి అడుగుపెట్టి ఏమయ్యాడో చూశాక.. దేవి అలాంటి సాహసం ఎందుకు చేస్తాడు చెప్పండి?