Begin typing your search above and press return to search.

ఆ హీరో కోసం ఐదేళ్లుగా ట్రై చేస్తున్న అరవింద్

By:  Tupaki Desk   |   6 Jan 2018 8:03 AM GMT
ఆ హీరో కోసం ఐదేళ్లుగా ట్రై చేస్తున్న అరవింద్
X
తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ రావడానికి కారణమైన సినిమా ‘గజిని’. ఆ సినిమాతోనే అతనిక్కడ నిలదొక్కుకున్నాడు. పెద్ద హీరో అయ్యాడు. ‘గజిని’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేసి.. పెద్ద స్థాయికి తీసుకెళ్లిన ఘనత అల్లు అరవిందుదే. అందుకే అల్లువారి మీద ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు సూర్య. తాజాగా తన కొత్త సినిమా ‘గ్యాంగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అరవింద్ ను తెగ పొగిడేశాడు అరవింద్.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘గజిని’ సినిమా తెలుగులో హిట్టవడానికి.. తెలుగులో సూర్యకు ఫాలోయింగ్ రావడానికి తానే కారణమని అతను అనుకుంటూ ఉంటాడని.. ఇదే మాట మళ్లీ మళ్లీ చెబుతుంటాడని.. కానీ ‘గజిని’గా సూర్య అద్భుతంగా నటించాడు కాబట్టే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది తప్ప తన ప్రమేయం ఏమీ లేదని అన్నాడు.

సూర్య అంటే తనకు చాలా ఇష్టమని.. అతడితో సినిమా చేయాలని తాను ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నానని.. సూర్య కూడా అందుకు సుముఖంగానే ఉన్నాడని.. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరడం లేదని అల్లు అరవింద్ చెప్పాడు. ‘గ్యాంగ్’ సినిమాను తాను ఇప్పటికే చూశానని.. చాలా బాగుందని.. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు అరవింద్.