Begin typing your search above and press return to search.

కేబుల్ బ్రిడ్జి మీద జూనియ‌ర్ బ‌న్ని అల్ల‌రి అర్హ కార్ రైడ్

By:  Tupaki Desk   |   22 July 2021 4:30 PM GMT
కేబుల్ బ్రిడ్జి మీద జూనియ‌ర్ బ‌న్ని అల్ల‌రి అర్హ కార్ రైడ్
X
అల్ల‌రి పిడుగు అల్లు అర్హ‌.. జూనియ‌ర్ బ‌న్ని ఎక్క‌డికో ఆ రైడ్. డాడీ అల్లు అర్జున్ కార్ లో అలా సిటీ మీద రైడ్ కి వెళ్లారు. జూబ్లీహిల్స్ లో కేబుల్ బ్రిడ్జి అందాల‌ను వీక్షిస్తూ అన్నాచెల్లెళ్లు ఎంతగా చిల్ అవుతున్నారో చూశారు క‌దా..! న‌గ‌రంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఎలివేటెడ్ ప్లేస్ ఇది. బ‌న్ని స్వ‌యంగా కార్ డ్రైవ్ చేస్తూ కిడ్స్ కి అలా ట్రీట్ ని ప్లాన్ చేశారు. ఇది మ‌ర‌చిపోలేని స్పెష‌ల్ రైడ్ అని భావించాలి. అల్లు స్నేహారెడ్డి స్వ‌యంగా ఇన్ స్టాలో ఈ వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఇంత‌కీ కేబుల్ బ్రిడ్జి అంటే ఏమిటి?

హైద‌రాబాద్ న‌గ‌రానికే త‌ల‌మానికంగా క‌నిపించే కాస్ట్ లీ బ్రిడ్జి ఇది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి దుర్గం చెరువు వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ని ఇంత‌కుముందు మంత్రి కేటీఆర్ లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ కి వన్నె తెచ్చిన బ్యూటిఫుల్ ఎలివేటెడ్ కారిడార్ గా టూరిస్టుల‌ను ఆక‌ర్షిస్తోంది. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌.ఆర్‌.డి.పి) కింద ఈ ప్రాజెక్టును నిర్మించారు.

ఫ్లైఓవర్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ .. మాధాపూర్ రోడ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి దుర్గం చెరువు ద్వారా మైండ్ స్పేస్ జంక్షన్ వరకు సజావుగా ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేసిన బ్రిడ్జి ఇది.

కారిడార్ దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జ్ తో అనుసంధానించబడినందున ఇది మైండ్‌స్పేస్ నుండి జూబ్లీ హిల్స్ వరకు ప్రయాణ సమయాన్ని 2 కిలోమీటర్ల మేర తగ్గించింది. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన 1740 మీటర్ల పొడవు.. 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లైఓవర్ నాలుగు లేన్ల ట్రాఫిక్ ప్రవాహానికి వీలు కల్పిస్తుంది. ఫ్లైఓవర్ నిర్మాణం 2018 ఏప్రిల్ లో ప్రారంభమైనప్పటికీ భూసేకరణ సమస్యల్లో చిక్కుకున్నందున ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. వాణిజ్య సంస్థల యజమానులు ఫ్లైఓవర్ ను ప్రశంసించగా.. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 సమీప ప్రాంతాల నివాసితులు వాహనాల రాకపోకలు పెరిగి ధ్వ‌ని కాలుష్యం పెరుగుతుంద‌ని గొడ‌వ‌లు చేసారు. ప్ర‌జ‌లు ఎంత‌గా నిర‌సించినా అంతిమంగా ప్ర‌భుత్వ ప్ర‌య‌త్న‌మే నెగ్గింది.