Begin typing your search above and press return to search.
అల్లు అర్హకు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
By: Tupaki Desk | 21 Nov 2021 9:37 AM GMTఅల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి తెలియని వారు ఉండరు. ఆమె సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి కూడా తెల్సిందే. చిన్నప్పటి నుండే తన క్యూట్ మాటలతో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకున్న అల్లు అర్హ ఇప్పుడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న భారీ సినిమా శాకుంతలం సినిమాలో భరతుడిగా కనిపించబోతుంది. ఇప్పటికే అర్హ షూటింగ్ ను పూర్తి చేసింది.
అర్హ తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో అల్లు అర్హ పేరు చేరింది. ఆరు ఏళ్ల వయసులోనే అర్హ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో అల్లు అభిమానుల ఆనందంకు అవధులు లేవు.
అల్లు అర్హ 5 ఏళ్ల వయసులోనే చెస్ నేర్చుకోవడమే కాకుండా రెండు నెలల్లోనే 50 మందికి చెస్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఈ అరుదైన ఘనతకు గాను ఆరేళ్ల అర్హకు అరుదైన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లభించింది. అల్లు అర్హ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా విషయాన్ని అభిమానులతో స్నేహా రెడ్డి మరియు అల్లు అర్జున్ లు షేర్ చేసుకున్నారు.
అల్లు వారి ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అర్హ ప్రతిభ పాటవాల గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఎత్తున అర్హ గురించిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది.
చెస్ వంటి అత్యంత కఠినమైన గేమ్ ను అంత ఈజీగా అర్హ ఎలా నేర్చుకుంది.. అది కాకుండా ఆమె ఎలా ఇతరులకు ట్రైనింగ్ ఇచ్చింది అంటూ నెటిజన్స్ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అర్హ కు ఒక ప్రముఖ చెస్ అకాడమీ వారు ట్రైనింగ్ ఇచ్చారట. చాలా యాక్టివ్ అమ్మాయి అయిన అర్హ చాలా ఈజీగా చెస్ నేర్చుకుని ఇతరులకు నేర్పేసిందని మెగా కాంపౌండ్ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి అల్లు అర్హకు ఈ అరుదైన రికార్డు రావడం తల్లిదండ్రులు.. ఇతర కుటుంబ సభ్యులతో పాటు అభిమానులందరికి కూడా చాలా ఆనందంగా ఉంది అనడంలో సందేహం లేదు.