Begin typing your search above and press return to search.
మట్టి బొమ్మల తయారీలో అల్లు అర్హ నైపుణ్యం
By: Tupaki Desk | 14 Aug 2021 5:30 PM GMTవినాయక చవితికి ప్రతి ఒక్కరూ వినాయకుడి మట్టి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఇటీవల క్లే - ఆర్ట్ ని ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తున్నాయి. మట్టి విగ్రహాల తయారీ పరిశ్రమకు గిరాకీ ఉందిప్పుడు. అదంతా సరే కానీ...మట్టితో స్టైలిష్ స్టార్ వారసురాలు అల్లు అర్హ కళాత్మక ఆర్ట్ ని పరిశీలించారా?
అలా చేత్తోనే ఎంతో అందమైన డిజైనర్ ఆకృతిని సిద్ధం చేసి ప్రదర్శిస్తోంది అర్హ. అది తాబేలు.. పర్ఫెక్ట్ రూపం కుదిరింది. ఇటీవలే శాకుంతలం లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి కాగానే తిరిగి ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఇలా మట్టి విగ్రహాల తయారీ నైపుణ్యం ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. గులాబీ స్వెట్ షర్ట్ ధరించిన అర్హ తనకు మట్టి అంటకుండా పైన యాప్రాన్ ని ధరించింది.
అర్హ చిన్నప్పటి నుంచే రకరకాల కళల్లో రాణిస్తోంది. బాలనటిగా తెరంగేట్రం చేస్తోంది కాబట్టి ఇకపైనా నటిగా అలరిస్తుందనే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లరితో పాటు అర్హలో ఉన్న క్వాలిటీస్ క్యూట్ నెస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.