Begin typing your search above and press return to search.
లైఫ్ అంటే అంతే .. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం: బన్నీ
By: Tupaki Desk | 31 Oct 2021 8:30 AM GMTవిజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ పై తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 12వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఈ సినిమా ఫంక్షన్ సందడిగా సాగింది. ఈ వేడుకలో ఇటు అల్లు అర్జున్ .. అటు విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా పునీత్ రాజ్ కుమార్ ను గుర్తుచేసుకున్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ .. "నాకు పునీత్ గారు ఎప్పటి నుంచో పరిచయం. మా ఇంటికి వచ్చేవారు .. ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఎన్నోసార్లు నేను బెంగుళూర్ వెళ్లినప్పుడు కలిశాను. ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉండేది. ఎన్నో ఫంక్షన్స్ లో కలిశాం. ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి ఇద్దరం న్యాయ నిర్ణేతలుగా కూడా చేశాము. ఎప్పుడు కలిసినా 'ఒక సారి బెంగుళూరు రండి' అనేవారు .. 'వస్తాను సార్' అనేవాడిని. అలా మాట్లాడే వ్యక్తి హఠాత్తుగా వెళ్లిపోయారు. నేను ఈ న్యూస్ ఫస్టు టైమ్ వినగానే షాక్ అయ్యాను. ఎందుకో తెలియదు విన్నప్పటి కంటే ఆ తరువాత గంట గంటకు ఆ బాధ పెరుగుతూ పోయింది.
ఈ విషయాన్ని గురించి రానా కూడా నాకు కాల్ చేశాడు .. రానా నాకు చాలా క్లోజ్ అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. లైఫ్ అంటే ఇంతే కదా .. ఎందుకో నీకు కాల్ చేయాలనిపించింది .. చేశాను అన్నాడు. అప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది .. ఎవరైనా అంతే. అందుకే ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి. పునీత్ రాజ్ కుమార్ గ్రేట్ సోల్. సౌంత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన చెప్పుకోదగిన హీరో .. అంటూ కొంతసేపు మౌనం పాటించారు. ఇక విజయ్ దేవరకొండ కూడా పునీత్ రాజ్ కుమార్ తో తనకి గల పరిచయాన్ని గుర్తుచేసుకున్నాడు.
"పునీతన్న చనిపోయాడు .. నేను ఆయనను ఒకసారి కలిశాను. ఒకసారి ఇంటికి పిలిస్తే వెళ్లి రెండు మూడు గంటలు గడిపాను. ఆయన హఠాత్తుగా వెళ్లిపోవడం నన్ను చాలా డిస్టబ్ చేసింది. తనంటే పరిచయమున్నవాళ్లు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. బన్నీ అన్న కూడా ఇంతకుముందే ఆ విషయం గురించే మాట్లాడే. నిన్నటి నుంచి ఇదే ఆలోచన నడుస్తోంది. మీ అందరికీ ఒక మాట చెప్పాలకుంటున్నా. ఒక యాక్టర్ గా కాకుండా మీ ఫ్రెండ్ గా చెబుతున్నాను అనుకోండి .. అట్లనే అర్థం చేసుకోండి. ఏదో ఒక రోజున మనందరం పోయేవాళ్లమే. ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉందాం... పని చేద్దాం .. ప్రేమిద్దాం. ఎవరితో ఎవరూ గొడవలు పడకుండా హ్యాపీగా ఉండండి" అని చెప్పుకొచ్చాడు.