Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : గంగోత్రిని కలిసిన పుష్పరాజ్‌

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:38 AM GMT
ఫోటోటాక్ : గంగోత్రిని కలిసిన పుష్పరాజ్‌
X
అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ తో పాటు అప్పటి స్టార్‌ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌ సోదరి అదితి అగర్వాల్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్‌ స్టార్‌ హీరో అయ్యాడు. కాని అదితి అగర్వాల్‌ కి పెద్దగా ఆఫర్లు రాలేదు.. వచ్చిన సినిమా ఆఫర్లు కూడా నిరాశ పర్చాయి.

ఆఫర్లు లేకపోవడంతో తక్కువ కాలం కే అదితి అగర్వాల్ కనుమరుగయ్యింది. కానీ అల్లు అర్జున్‌ టాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోగా మారడంతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. ఎంతటి స్టార్‌ అయినా తన మొదటి సినిమా చాలా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. అందుకే తన మొదటి సినిమా హీరోయిన్ అదితి అగర్వాల్‌ తో బన్నీ ఇలా తాజాగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు.

అల్లు అర్జున్‌ ఇటీవల అమెరికాలో అదితి అగర్వాల్‌ ను కలిశాడు. వీరిద్దరు కాకతాళీయంగా కలిశారా లేదంటే ఏదైనా కార్యక్రమంలో కలుసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదితి అగర్వాల్ ఊహించనంతగా మారింది. ఆమె హీరోయిన్ గా నటించినప్పటి కంటే ఇప్పుడు అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అదితి అగర్వాల్‌ ని బన్నీ పక్కన చూస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలిసి ఒక సినిమా ను చేస్తే బాగుండు అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు అవ్వబోతున్నా కూడా అదితి అగర్వాల్‌ ఇంకా అందంగా కనిపిస్తున్నారని.. ఆమె మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తే తప్పకుండా మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే నేడు పుష్ప 2 యొక్క పూజా కార్యక్రమాలు జరుగబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ను కూడా ప్రారంభించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్నారు.