Begin typing your search above and press return to search.

బ‌న్ని గుండెల‌పై చిన్నారి అర్హ.. నాన్న‌ ప్రేమ‌కు ఆకాశ‌మే హద్దు!

By:  Tupaki Desk   |   21 April 2021 1:37 PM GMT
బ‌న్ని గుండెల‌పై చిన్నారి అర్హ.. నాన్న‌ ప్రేమ‌కు ఆకాశ‌మే హద్దు!
X
తండ్రికి కూతురితో అనుబంధం.. త‌ల్లికి కొడుకుతో అనుబంధం ఎంతో ప్ర‌త్యేకం. అందుకే కూతురిని నాన్న కూచీ అంటారు. ఇదిగో ఇక్క‌డ బన్నీకి త‌న‌ కుమార్తె అర్హ‌తో ఉన్న అనుబంధం ప్రేమానురాగం ఎలాంటివో తెలిపేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు. అర్హ ఎప్పుడు ఎలాంటి అల్ల‌రి చేసినా డాడీ ఎంతో ఉప్పొంగిపోతాడు. ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు.

ఇప్పుడు బ‌న్ని గుండెల‌పై నిలుచుని చిన్నారి అర్హ ఎంత అల్ల‌రి చేస్తోందో చూశారుగా... తండ్రి ప్రేమ విలువ ఇదీ! నాన్న ప్రేమ ఎంతటి ప్రీతిపాత్రమైనదో అర్హ‌ను అడ‌గాలి! ఈ ప్రేమ‌కు ఆకాశ‌మే హద్దు! అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. అల్లు స్నేహారెడ్డి ఈ ఫోటోని స్వ‌యంగా షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చారు. ``ఫాద‌ర్స్ ల‌వ్ ఈజ్ మోస్ట్ ప్రీసియ‌స్ వ‌న్`` అనేది క్యాప్ష‌న్. ఈ ఫోటోపై యానిమేటెడ్ టాయ్ ఎక్స్ ప్రెన్ ఆక‌ట్టుకుంది.

బ‌న్ని ప్ర‌స్తుతం పుష్ప చిత్రంలో న‌టిస్తున్నారు. సెకండ్ వేవ్ ఉన్నా పుష్ప చిత్రీక‌ర‌ణ సాగుతోంది. సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పుష్ప షూట్ గ్యాప్ లో ఏమాత్రం అవ‌కాశం చిక్కినా అర్హ‌తోనే బ‌న్ని టైమ్ పాస్ అన్న సంగ‌తి తెలిసిన‌దే.