Begin typing your search above and press return to search.
క్యూటీ అర్హ స్థాయికి ఒదిగి ఆటలాడే స్టార్ డాడీ
By: Tupaki Desk | 11 Aug 2021 9:30 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తారు. రకరకాల షెడ్యూళ్లతో ఉన్నా.. పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆటల కోసం వారితో పసిపాపాయిగా మారిపోతారు. అదీ గారాల పట్టి అర్హ కోసమైతే బన్నీ ప్రాణం పెట్టేస్తారు. అర్హతో ఆటలాడుతున్నప్పుడు తన వయసుకి దిగి వచ్చి ఒదిగిపోతారు. అచ్చం తనలాగే ఆటలాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే అర్హనే ఆటపట్టిస్తూ సరదాపడతారు. గతంలో అర్హతో ఫన్సీ గేమ్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెసిందే.
తాజాగా బన్నీ మరోసారి తన గారాల పట్టితో ఇంట్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే ముచ్చటేస్తోంది. బబుల్ గన్ తో బబుల్స్ వదులుతూ అర్హని ఆటపట్టిస్తున్నారు బన్నీ. అర్హ కూడా అంతే ఉత్సాహంగా తండ్రితో కలిసి ఆడుతుంది. ఈ వీడియోని బన్నీ ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యూటీ అర్హ తో తన సంతోషాన్ని షేర్ చేసుకోవడం పట్ల మెగా- అల్లు అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతూ ఖుషీ అవుతున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా `పుష్ప`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతోంది. సుకుమార్ దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే పుష్ప -1 ప్రథమార్థం షూటింగ్ పూర్తయింది. రెండవ భాగం షూట్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తవ్వగానే బన్ని- వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న `ఐకాన్` చిత్రీకరణలో జాయిన్ అవుతారు. ఇది స్టైలిష్ ఎంటర్ టైనర్. బన్నీ లో వివిధ కోణాల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. అలాగే అభిమానులకు కావాల్సిన మసాలా అంశాలు కూడా పుష్కలంగానే ఉంటాయని ఇటీవలే డైరెక్టర్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
అర్హ రేంజు డాడీని మించేలా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటవారసురాలు అల్లు అర్హ బాల నటిగా తెరంగేట్రం చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోది. ఇండస్ట్రీలో ఎందరినో బాలనటులుగా పరిచయం చేసిన సీనియర్ దర్శకులు గుణశేఖర్ అర్హను కూడా తెరకు పరిచయం చేస్తున్నారు. అతడు తెరకెక్కిస్తున్న శాకుంతలం చిత్రంలో క్యూట్ అర్హ బాలనటిగా మెరవనుంది. ఇప్పటికే అర్హ పై పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. చిత్రీకరణ పూర్తయయాక వీడ్కోలు పలికే సమయంలో బన్ని- స్నేహ దంపతులు అర్హతో ఉన్నారు. అర్హకు ఘనమైన ఆరంగేట్రమిది. ఆ ఆనందం అల్లు కుటుంబంలో స్పష్ఠంగా కనిపిస్తోంది. శాకుంతలంలో అర్హ నటిస్తోంది అనగానే బన్ని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. తనని పెద్ద తెరపై చూడాలని ఎంతో ముచ్చటపడుతున్నారు. `ప్రిన్స్ భరత్` అనే పాత్రలో అర్హ అలరిస్తుందని తెలిసింది.
పురు రాజవంశం రాజు దుష్యంతుల జీవితం ఆధారంగా రూపొందుతున్న పౌరాణిక డ్రామా శాకుంతలం. సమంతతో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్టంతగా కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.