Begin typing your search above and press return to search.

#క్యూట్ పెయిర్.. మెమ‌రీ లేన్ లో బ‌న్ని తీపి గురుతులు

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:46 PM GMT
#క్యూట్ పెయిర్.. మెమ‌రీ లేన్ లో బ‌న్ని తీపి గురుతులు
X
కొన్ని ఫోటోలు ఆల్బ‌మ్ లో చాలా ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తాయి. అలాంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫోటోని షేర్ చేసిన బ‌న్ని మోములో ఆనందం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌లే విదేశాల‌కు టూర్ వెళ్లిన అల్లు అర్జున్ అక్క‌డ త‌న భార్యామ‌ణి స్నేహ‌తో క‌లిసి దిగిన ఓ అరుదైన అంద‌మైన ఫోటోని షేర్ చేసి త‌న భావోద్వేగాన్ని పంచుకున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` సీక్వెల్ కోసం స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నా కానీ ఆ మూవీ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాప్ లో షార్ట్ వెకేష‌న్స్ పేరుతో బ‌న్ని త‌న కుటుంబంతో తీరిక‌ స‌మ‌యాన్ని గడుపుతున్నాడు.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన బెటర్ హాఫ్ అల్లు స్నేహ రెడ్డితో ఒక అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. అతను ఈ ఫోటోకి హారిస్ జైరాజ్ స్వరపరిచిన పచ్చైకిలి ముత్తుచురంలోని పాపుల‌ర్ తమిళ పాట ఉనక్కుల్ నానేని జోడించాడు. త్వరలోనే పుష్ప 2 సెట్స్ లో చేరాల్సి ఉంది. ఈలోగానే మెమ‌రీ లేన్ నుంచి అద్భుత ఫోటోల‌ను బ‌న్ని షేర్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే విదేశీ టూర్ ముగించిన అల్లు అర్జున్ త‌దుప‌రి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు.

2022-23 మోస్ట్ అవైటెడ్ మూవీగా తెర‌కెక్కనున్న పుష్ప 2 కోసం సుకుమార్ సైతం ఎంతో భారీ క‌స‌ర‌త్తు చేస్తూ మూవీపై హైప్ పెంచేస్తున్నాడు. ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్రతిదీ జాగ్ర‌త్త‌గా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా పూర్త‌య్యేందుకు భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఈ సీక్వెల్ తో కేజీఎఫ్ 2 డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కి వ‌చ్చిన క్రేజ్ సుకుమార్ కి కూడా వ‌స్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

పుష్ప‌రాజ్ గా పార్ట్ 2లో బ‌న్ని విశ్వ‌రూపం చూడ‌బోతున్నాం. ఫ‌హ‌ద్ ఫాజిల్ పాత్ర తొలి భాగంలో కేవ‌లం ట్రైల‌ర్ లాంటిద‌ని చెప్పారు. పార్ట్ 2లో ఆ పాత్ర తీరు తెన్నులు ఎలా మార‌నున్నాయో చూడాలి. అన‌సూయ‌- సునీల్ పాత్ర‌ల సంగ‌తేమిటో కూడా వేచి చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో అలానే ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.