Begin typing your search above and press return to search.
బన్నీ వదిలినా.. ఆయన వదలట్లేదు
By: Tupaki Desk | 25 Feb 2017 12:49 PM GMTగత ఏడాది లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయాల్సిన బైలింగ్వల్ ప్రాజెక్టు గురించి ఘనంగా ప్రకటించారు. అల్లు అర్జున్ చెన్నై వెళ్లి దర్శకుడు లింగుస్వామి.. నిర్మాత జ్నానవేల్ రాజాల సమక్షంలో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఐతే ఆ ప్రాజెక్టు గురించి తర్వాత ఏ అప్ డేట్ లేదు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాల్లో క్లారిటీ లేదు.
ఇంతలో ‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తెరమీదకు వచ్చింది. దీంతో లింగుస్వామి సినిమా సంగతేంటో అన్న అయోమయం నెలకొంది. మరోవైపు లింగుస్వామి.. జ్నానవేల్ రాజా ఇద్దరూ కూడా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో బన్నీ ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకోవడానికే నిర్ణయించుకున్నట్లుగా వార్తలొచ్చాయి. ఐతే బన్నీ ఈ ప్రాజెక్టు విషయంల అంత ఆసక్తిగా లేకపోయినా.. లింగుస్వామి మాత్రం అతణ్ని వదిలేలా లేదు.
బన్నీతో తాను చేయాల్సిన సినిమా ఆగిపోయినట్లుగా వార్తలొచ్చిన నేపథ్యంలో లింగుస్వామి ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఉంటుందన్నాడు. దీని కంటే ముందు విశాల్ తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘‘నా తర్వాత సినిమా సెండైకోళి-2 (పందెంకోడి-2) విశాల్ తో చేయబోతున్నా. దాని తర్వాత జ్నానవేల్ రాజా నిర్మాణంలో అల్లు అర్జున్ తో సినిమా చేస్తా. ఇక రూమర్లు కట్టిపెట్టండి’’ అని ట్వీట్ చేశాడు లింగుస్వామి. మరి లింగుస్వామి అంత పట్టుదలగా ఉన్నాడు కాబట్టి బన్నీ ఈ సినిమా చేస్తున్నట్లేనా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/