Begin typing your search above and press return to search.

మార్చ్ లో బన్నీ నయా మూవీ

By:  Tupaki Desk   |   2 Oct 2017 4:24 PM GMT
మార్చ్ లో బన్నీ నయా మూవీ
X
టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే మాస్ హీరో ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్ ను బన్నీ సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే మలయాళంలో తన సినిమాలను డబ్ చేస్తూ.. అక్కడ కూడా మనోడు హవాను కొనసాగిస్తున్నాడు. అలాగే తమిళ్ లో కూడా తన టాలెంట్ ని చూపించాలని బన్నీ ట్రై చేస్తున్నాడు.

చాలా కాలం నుంచి తమిళ్ డైరెక్టర్ లింగు స్వామితో ఒక సినిమాను చేయాలనుకుంటున్నాడు బన్నీ. ఈ వార్త చాలా కాలం నుంచి వినిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది ఎలాగైనా ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. 2018 మార్చ్ లో సినిమా సెట్స్ పై కి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లింగు స్వామి ఆ కథను ఒకేసారి తెలుగు తమిళ్ లో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ వక్కంతం వంశీ తో నా పేరు సూర్యా అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం వూటీలో కొనసాగుతోంది. 2018 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లింగుస్వామి ప్రాజెక్టు ను బన్నీ మార్చ్ లో స్టార్ట్ చేసి ఏడాది చివరలోనే రిలీజ్ చేసందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఊటీలో 'నా పేరు సూర్య' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మనోడు ఒక మిలిటరీ మ్యాన్ గా.. అలాగే మరో షేడ్ ఉన్న పాత్రలో చేస్తున్నాడు. అది సంగతి.