Begin typing your search above and press return to search.

మహేశ్‌బాబు తర్వాత బన్నీనే..!

By:  Tupaki Desk   |   20 March 2015 7:30 AM GMT
మహేశ్‌బాబు తర్వాత బన్నీనే..!
X
ఎండార్స్‌మెంట్‌ ఒప్పందాలు.. ఒక హీరోకు ఉన్న క్రేజ్‌కు ప్రతిరూపాలు. హీరోకు ఉన్న క్రేజ్‌ను బట్టి వివిధ వాణిజ్య సంస్థలు వారిని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా నియమించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇండియాలో అలా బ్రాండ్‌అంబాసిడర్‌లుగా నియమితమయ్యే వాళ్లలో క్రికెటర్లు, సినిమా వాళ్లు ముఖ్యులు. సినిమా వాళ్ల విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తే.. ఈ విషయంలో బాలీవుడ్‌ వాళ్లదే హవా. ప్రాంతీయ హీరోలకు అంతగా అవకాశాలు ఉండవు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహేశ్‌బాబు వంటి హీరోలు రాణిస్తున్నారు. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్‌మెంట్లలో కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దక్షిణాదిలో మహేశ్‌బాబు ఎండార్స్‌మెంట్‌ ఒప్పందాల్లో ముందున్నాడు.

తెలుగు వరకూ అయితే ఇప్పుడు మహేశ్‌బాబు తర్వాతిస్థానంలో ఉన్నాడు అల్లు ఆర్జున్‌. చాన్నాళ్ల నుంచినే ఒక సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌కు బన్నీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు.

అంతేగాక ఒక మొబైల్‌ స్టోర్‌ వాళ్ల ప్రచారంలో కూడా బన్నీ భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక మోటర్‌బైక్‌యాడ్‌లో కూడా బన్నీ కనిపిస్తున్నాడు. మహేశ్‌బాబు ఒక మోటార్‌ బైక్‌ కంపెనీకి ప్రచార కర్తగా ఉండగా.. బన్నీ మరో మోటార్‌బైక్‌ కంపెనీని ప్రమోట్‌ చేస్తున్నాడు. ఈ విధంగా తన స్టామినా చాటుకొంటున్నాడు!