Begin typing your search above and press return to search.

అక్కడ బన్నీకి కాంపిటీషన్ మొదలింది

By:  Tupaki Desk   |   16 Sep 2016 5:30 PM GMT
అక్కడ బన్నీకి కాంపిటీషన్ మొదలింది
X
అల్లు అర్జున్ .. క్రమక్రంగా మెరుగవుతూ తనకంటూ స్టార్ స్టేటస్ ని అలవరుచుకున్న నటుడు. తెలుగు రాష్ట్రాలలోనేకాక తమిళ, మలయాళ రీజియన్ ఓవర్ సీస్ లో తనకంటూ మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. వరుసపెట్టి హిట్ చిత్రాలతో కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ తరం హీరోలలో కొత్తగా బన్నీకి కాంపిటీషన్ ఎదురైంది. అదెవరో కాదు తారక్.

అదేంటి మెగాస్టార్ చిరంజీవికే పోటీ ఇచ్చిన తారక్ ఇప్పుడు కొత్తగా బన్నీకి పోటీ ఏంటి అనుకుంటున్నారా? అప్పుడు తారక్ ట్రాక్ రికార్డు ఇప్పటికి లేదన్నది వాస్తవమే. మాస్ లో ఎంత పల్స్ వున్నా తారక్ సినిమాలు 50 కోట్లు దాటడం కష్టమైపోతుంది. ఇతర రాష్ట్రాలు ఓవర్ సీస్ లో ఎక్కువ ఆదరణ లేదు. మరోపక్క బన్నీ ఈజీగా 60కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. కేరళలో మల్లు అర్జున్ అని ఓన్ చేసుకునే రేంజ్ కి వెళ్ళిపోయాడు.

అయితే ఇప్పుడు ఈ విధానం కాస్త మారింది. సరైనోడు సినిమా ఇక్కడ మంచి హిట్ అయినా ఓవర్ సీస్ లో ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కానీ తారక్ జనతా గ్యారేజ్ మాత్రం తెలుగు - ఓవర్ సీస్ తో పాటూ మోహన్ లాల్ కలయిక వలన మలయాళంలో కూడా మంచి విజయం సాధించింది. దీంతో బన్నీకి తారక్ మిగిలిన ఏరియాలలో పోటీగా మారాడు. పోటీ మంచిదే.. ఎంత పోటీ వుంటే అంత మంచి అవుట్ పుట్ వస్తుంది.