Begin typing your search above and press return to search.

వర్కింగ్‌ స్టిల్స్‌ కే మరీ ఇంత ఓవర్‌ యాక్షన్‌ చేస్తుందేంటి

By:  Tupaki Desk   |   12 Jan 2020 1:30 AM GMT
వర్కింగ్‌ స్టిల్స్‌ కే మరీ ఇంత ఓవర్‌ యాక్షన్‌ చేస్తుందేంటి
X
అల వైకుంఠపురంలో చిత్రంతో మరోసారి తన లక్‌ ను పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు పూజా హెగ్డే రాబోతుంది. ఈ అమ్మడు స్టార్‌ హీరోల సరసన అయితే నటిస్తోంది కాని ఇప్పటి వరకు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను మాత్రం దక్కించుకోలేదు. అల వైకుంఠపురంలో సినిమా అయినా ఆ లోటును తీర్చుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటూ తన ఫాలోవర్స్‌ కు నయనానందంను కలిగిస్తూ ఉంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన పలు ఆన్‌ లొకేషన్‌ ఫొటోలను కొన్ని కారణాల వల్ల పోస్ట్‌ చేయలేక పోయాను. ఈఫిల్‌ టవర్‌ వద్ద తీసుకున్న ఫొటోలను మాత్రం ఆగలేక పోస్ట్‌ చేశాను. అల్లు అర్జున్‌ తో అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్‌ సందర్బంగా తీసుకున్న ఫొటోలను అతి త్వరలోనే మీ ముందుకు తీసుకు వస్తాను అంటూ చాలా సంతోషంగా ప్రకటించింది.

ప్రతి సినిమాకు షూటింగ్‌ సందర్బంగా ఫొటోలు తీసుకుంటారు. కాని ఈసారి చాలా స్పెషల్‌ గా వాటిని త్వరలో మీ ముందుకు తీసుకు వస్తానంటూ పూజా హెగ్డే చెప్పడం ఏంటా అంటూ చర్చ జరుగుతుంది. మరికొందరు మాత్రం వర్కింగ్‌ స్టిల్స్‌ కు మరీ ఇంత ఓవర్‌ యాక్షన్‌ ఎందుకు అమ్మడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత ఈ అమ్మడు ప్రభాస్‌ చిత్రం 'జాన్‌' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.