Begin typing your search above and press return to search.

బన్నీతో డ్యాన్స్ అంటే సాగదీయాల్సిందే

By:  Tupaki Desk   |   4 Jun 2017 5:45 AM GMT
బన్నీతో డ్యాన్స్ అంటే సాగదీయాల్సిందే
X
టాలీవుడ్ లో డ్యాన్సింగ్ స్టార్ అంటే మొదటగా గుర్తొచ్చే వారిలో అల్లు అర్జున్ పేరు కూడా ఉంటుంది. పాటలకు.. అందులో డ్యాన్స్ లకు ఆ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడు బన్నీ. తను చేసినంతగా పక్కన ఉన్నవాళ్లను కూడా చేయాలని రూలేమీ పెట్టడు కానీ.. అవసరమైతే మాత్రం.. హీరోను మ్యాచ్ చేసేవరకూ డ్యాన్స్ చేయాల్సిందే.

ఇప్పుడు డీజే- దువ్వాడ జగన్నాధం మూవీలో స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయనే విషయం.. ఇప్పటికే ఓ చిన్నపాటి టీజర్ ద్వారా తెలిసిపోయింది. అదిరిపోయే స్టెప్స్ వేసి బన్నీ ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ.. దాదాపుగా అల్లు అర్జున్ ను మ్యాచ్ చేస్తూ పూజా హెగ్డే అదరగొట్టేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయడం అంటే ఎలా ఉంటుందో ఓ ఫోటో ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. బన్నీ ఓ చెయిర్ పై కూర్చుని స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ సలహాలు ఇస్తుంటే.. పక్కన కింద కూర్చున్న పూజా హెగ్డే ప్రాక్టీస్ చేస్తోంది. కాళ్లు చాపి.. తన చేతులతో పాదాలను అందుకునేందుకు.. పాపం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

'అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయాలంటే.. ఇంకొంచెం ఎక్ స్ట్రాగా మీరు సాగదీయాల్సిందే. బాస్ లా ఉన్నాడు కదూ. రిహార్సల్స్ చేసేటప్పటి ఫోటో ఇది' అంటూ.. తమ డ్యాన్స్ ప్రాక్టీస్ కి ముందు.. ఫ్లోర్ లో తను సాగదీసిన విషయాన్ని చూపించింది పూజా హెగ్డే. పక్కన బన్నీ మాత్రం సింపుల్ గా నవ్వేసుకుంటూ.. స్మార్ట్ ఫోన్ ను తెగ నమిలేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/