Begin typing your search above and press return to search.

సాం అండ్ బన్నీ-మ్యాంగో వార్

By:  Tupaki Desk   |   13 Jan 2018 6:38 AM GMT
సాం అండ్ బన్నీ-మ్యాంగో వార్
X
తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం కంపనీలు సినిమా సెలబ్రిటీల ద్వారా ప్రమోట్ చేయించడం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. మహానటి సావిత్రి గారు మొదలుకొని ఇప్పటి శాలిని పాండే వరకు అందరూ బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఇందులో కూడా పోటీ మొదలైంది. రానున్న వేసవి సాఫ్ట్ డ్రింక్ సంస్థలకు ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మామిడి పళ్ళ జ్యూస్ ని ఆధారంగా చేసుకుని తయారుచేసే వాటికి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కారణం వాటిలో కెఫెన్ లాంటి ప్రిజర్వేటివ్స్ ఏవి ఉండకపోవడం ఒకటైతే, చిన్నపిల్లలు మొదలుకొని మహిళల వరకు ఎక్కువ శాతం ఇష్టపడే ఫ్లేవర్ మ్యాంగో కావడం. అందుకే రానున్న సీజన్ ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపబోతున్నారు.

మ్యాంగో డ్రింక్స్ లో బాగా పాపులరైన మాజా, ఫ్రూటి బ్రాండ్స్ సమ్మర్ లో స్పెషల్ ప్లాన్స్ తో సిద్ధం అవుతున్నాయి. మాజా బ్రాండ్ ను ఇప్పటికే సమంతా ప్రమోట్ చేస్తుండగా వాటికి స్పందన కూడా బాగుండటంతో అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఫ్రూటి బ్రాండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒప్పందం చేసుకుంది. బన్నీ తో యాడ్స్ చేయించడం వల్ల సేల్స్ కు బాగా హెల్ప్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం. పైగా బన్నీకి మలయాళంలో సైతం మంచి ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా వీటికి వాడుకోవడం ప్లస్ అవుతుంది.

సో సమ్మర్ లో మా డ్రింక్ తాగండి అంటే మా డ్రింక్ తాగండి అంటూ సమంతా - అల్లు అర్జున్ పోటీ పడుతూ చెప్పే యాడ్స్ త్వరలోనే చూడబోతున్నాం. నా పేరు సూర్యతో ఏప్రిల్ 27న ప్రేక్షకులను పలకరించడానికి బన్నీ రెడీ అవుతుండగా అభిమన్యుడు - రంగస్థలం - మహానటి సినిమాతో తన ఫాన్స్ కి వరస కానుకలు ఇవ్వబోతోంది సమంతా. మరి ఈ మామిడి పళ్ళ జ్యూస్ యుద్ధంలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలంటె సమ్మర్ అయ్యాక సేల్స్ ఫిగర్స్ చూస్తే సరి.