Begin typing your search above and press return to search.
బొలీవియా పాటల కోసం బన్నీ తిప్పలు
By: Tupaki Desk | 13 April 2016 8:16 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కుర్ర భామలు రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసాలు నటించిన సరైనోడు మూవీ ఈ నెల 22న విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెండు పాటల కోసం దక్షిణ అమెరికాలోని బొలీవియా వెళ్లింది యూనిట్. ఆ సమయంలో వీళ్లకు ఎదురైన ఇబ్బందులను జనాలతో పంచుకున్నారు. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించేలా బొలీవియాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి.
కానీ అక్కడకు వెళ్లడం అంటే.. ప్రపంచంలో ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్లాలన్న మాట. 3 రోజుల పాటు ప్రయాణం చేసి చేరుకున్నారు. వీళ్లు షూటింగ్ చేయాలని భావించిన ఉయుని ప్రాంతంలో అసలు స్టార్ హోటల్స్ అనేవే ఉండవని, ట్రావెల్స్ వర్గాలు చెప్పడంతో ఆశ్చర్యపోయారట. స్టార్ హోటల్స్ లో కాకుండా హాస్టల్స్ లోనే అక్కడ ఉన్నన్ని రోజులు గడపాల్సి ఉంటుంది. అయితే.. వీళ్లకు బొలీవియాలో దిగిన దగ్గరనుంచే సమస్యలు చుట్టుముట్టాయట. ఏ కారణం చెప్పకుండానే ఎయిర్ పోర్టునుంచి బయటకు పంపలేదు అధికారులు. ఆ తర్వాత స్పానిష్ భాషలో బన్నీవాళ్లతో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు.
వీళ్లు అక్కడికి చేరుకునేందుకు రెండు వారాల ముందు పాక్ నుంచి ఫేక్ పాస్ పోర్టులతో చొరబడేందుకు యత్నించడంతో వీళ్లను అనుమానించారట అధికారులు. ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో ఉయుని చేరుకున్నారు. కానీ అది సముద్ర మట్టానికి 12వేల అఢుగుల ఎత్తున ఉండే ప్రదేశం కావడంతో చాలామంది ఆరోగ్యం దెబ్బ తింది. దీనికి తోడు దక్షిణ అమెరికా దేశాల్లో జికా వైరస్ భయాలు కూడా ఉన్నాయి. ఉయుని అత్యంత చల్లని ప్రదేశం కావడంతో ఆ ప్రమాదం లేదు. ఇలా ఇన్నేసి తిప్పలు పడి.. రెండు పాటలను షూటింగ్ చేసుకువచ్చింది సరైనోడు టీం.