Begin typing your search above and press return to search.
కిస్సింగ్ ఫోటోతో బన్నీ సంచలనం
By: Tupaki Desk | 24 March 2016 4:38 AM GMTఫేస్ బుక్ లో సంచలనాలు సృష్టించాలంటే అది స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాతే. ఇప్పటికే 1 కోటి మంది అభిమానులను సంపాదించిన బన్నీ.. అసలు ఇక్కడ ఏదైనా పోస్టు చేస్తే చాలు.. వెంటనే అందరూ లైకులతో ముంచేస్తున్నారు.
తను.. తన భార్య స్నేహ.. కొడుకు అయాన్ కు ఒకేసారి ముద్దిస్తున్న ఫోటోను ఒకటి బుధవారం రాత్రి అప్ లోడ్ చేశాడు. ఇలా సదరు ఫోటోను పోస్టు చేశాడో లేదో.. అరగంటలో 50 వేల మంది.. గంట పూర్తయ్యే లోపే లక్షన్నర మంది లైక్ చేశారు. అసలు బన్నీ ఒక ఫోటో పెట్టగానే ఇంత ఫాస్టుగా లైకులు పడుతున్నాయి అంటే మనం అర్ధంచేసుకోవచ్చు.. బన్నీ క్రేజు ఏ రేంజులో ఉందో. ఇంతకీ ఆ ఫోటో ఎక్కడ దిగారనే డౌటుందా మీకు? శ్రీజ పెళ్ళి కదండీ.. పెళ్ళికి ముందు అనేక ఫంక్షన్లు చేస్తున్నారు. గత రాత్రి జరిగిన అలాంటి ఒక ఫంక్షన్ లో ఈ ఫోటో దిగారు మనోళ్ళు.
అయితే అన్ని ఫోటోలకూ ఇలా వస్తాయని అనుకోవడానికి లేదు. కేవలం బన్నీ కొడుకు అండ్ వైఫ్ ఉన్న కిస్సింగ్ ఫోటోకు మాత్రమే ఇంత క్రేజీగా లైకులు వచ్చాయని చెప్పొచ్చు. ఓ మూడు రోజుల ముందు తమన్ తో కలసి బ్యాగ్రౌండ్ స్కోర్ సెషన్ లో కూర్చున్న బన్నీ.. ఆ ఫోటోను షేర్ చేశాడు. షేర్ చేసి మూడు రోజులైనా కూడా కేవలం 77 వేల లైకులు మాత్రమే వచ్చాయి. అది సంగతి.