Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: స్టైలిష్ ఉన్న స్టార్ కపుల్

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:17 PM GMT
ఫొటో స్టోరీ: స్టైలిష్ ఉన్న స్టార్ కపుల్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' రిలీజ్ అయి ఇప్పటికే మూడు నెలలయినా ఇంకా కొత్త సినిమా ప్రకటించలేదని అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు గానీ ఆయన మాత్రం తనకు దొరికిన సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఫ్యామిలీతో గడుపుతున్నాడు. స్టొరీ డిస్కషన్లు.. ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ మీటింగులు ఎప్పుడూ ఉండేవే గానీ తాజాగా భార్య స్నేహతో కలిసి అల్లు అర్జున్ ఒక ఎంగేజ్మెంట్ పార్టీ కి హాజరయ్యాడు. అక్కడ తీయించుకున్న ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ఆ ఫొటోకు 'ఎంగేజ్మెంట్ పార్టీ.. లవ్లీ వైబ్' అనే క్యాప్షన్ ఇచ్చాడు. నిజమే ఎంగేజ్మెంట్.. పెళ్ళి లాంటి అకేషన్స్ లో పాజిటివ్ ఫీలింగ్ ఉన్నట్టు అన్పిస్తుంది. ఎంగేజ్మెంట్ పై ..పెళ్ళిపై జోకులు చాలా ప్రచారంలో ఉన్నాయి గానీ వాటికి సంబంధం లేకుండా ఒక లవ్లీ ఎన్విరాన్మెంట్ ఈ అకేషన్స్ లో ఉంటుంది. ఈ ఎంగేజ్మెంట్ లో బన్నీ బ్లాక్ కలర్ డ్రెస్ లోనూ.. స్నేహ క్రీమ్ కలర్ డ్రెస్ లోనూ తళుక్కున మెరిశారు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా పెళ్లి కాని క్యూట్ యంగ్ కపుల్ లా కనిపించారంటే అదేమీ ఎక్కువ చెప్పడం కాదు.

ఫోటో పోస్ట్ చేసి 24 గంటలు కాకమునుపే దాదాపు 3 లక్షల లైకులు వచ్చాయంటే నెటిజనులకు ఎంతగా నచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. పనిలో పనిగా కొంతమంది ఫ్యాన్స్ కొత్త సినిమా గురించి అడిగారు. ఒక హిందీ అభిమాని 'అల్లు అర్జున్ భాయి కమ్ టు బాలీవుడ్' అని కోరాడు!